Shiva Raj Kumar DK : డీకేతో శివరాజ్ కుమార్ ముచ్చట
శివకుమార్ కు నటుడు, భార్య కంగ్రాట్స్
Shiva Raj Kumar DK : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొలువు తీరి కొన్ని రోజులు గడిచినా ఇంకా ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వారు బెంగళూరు బాట పట్టారు. ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. బుధవారం కన్నడ పరిశ్రమలో మోస్ట్ పాపులర్ హీరోగా పేరు పొందిన కన్నడ కంఠీరవ తనయుడు శివ రాజ్ కుమార్ , తన భార్యతో కలిసి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డీకేను ప్రత్యేకంగా అభినందించారు.
శివరాజ్ కుమార్(Shiva Raj Kumar) తో పాటు భార్య గీతా శివరాజ్ కుమార్ కూడా కలిసిన వారిలో ఉన్నారు. వారితో పాటు రాష్ట్ర మంత్రి మధు బంగారప్ప కూడా డీకేతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ శివరాజ్ కుమార్ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు డీకే శివకుమార్. శివ రాజ్ కుమార్ తమ్ముడు , ప్రముఖ నటుడు పప్పు గత ఏడాది గుండె పోటుతో మరణించారు. ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.
ఆ కుటుంబం వేలాది మందికి గుప్త దానాలు చేస్తూ వస్తోంది. విద్యా పరంగా విద్యార్థులు చదువుకునేందుకు విరాళాలు ఇస్తుంటారు. అందుకే అంతటి ఆదరణ. ఇక మధు బంగారప్ప దివంగత కాంగ్రెస్ అగ్ర నాయకుడు , మాజీ సీఎం బంగారప్ప తనయుడు. ఆయనకు కూడా ఈసారి కేబినెట్ లో చోటు దక్కింది. ఇదంతా డీకే శివకుమార్ చలవనేనని చెప్పక తప్పదు. మొత్తంగా వీరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది.
Also Read : Neil Tyson PM Modi : మోదీతో నీల్ టైసన్ ములాఖత్
