TSPSC GROUP-4 : గ్రూప్ -4 పరీక్షకు వేళాయె
భారీ ఎత్తున దరఖాస్తు
TSPSC GROUP-4 : పలు అనుమానాలు, పేపర్ లీకేజీల్ , దర్యాప్తు సంస్థ విచారణల మధ్య ఎట్టకేలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఎప్పటి లాగే గ్రూప్ -4 పరీక్షను జూలై 1నే నిర్వహిస్తామని వెల్లడించింది. ఎలాంటి అనుమానం చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా సాధ్యమైనంత త్వరలో పరీక్షలు చేపట్టాలని సంస్థ భావిస్తోంది. ఇప్పటికే హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది. మరో వైపు కొన్ని పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఓ వైపు విచారణ కొనసాగుతుండగా పరీక్షలు ఎలా చేపడతారంటూ ప్రశ్నిస్తున్నాయి.
వేల మంది అనుకుంటే పొరపాటు పడినట్లే. టీఎస్పీఎస్సీ(TSPSC)లో భారీ ఎత్తున గ్రూప్ -4 కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షకు సంబంధించి ఈ వారంలోనే హాల్ టికెట్లు విడుదల కానున్నట్లు సమాచారం. అసలే వర్షాకాలం పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు చైర్మన్ ఉన్నారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ పేర్కొంది.
కాగా గ్రూప్ -4 సర్వీసుకు సంబంధించి మొత్తం 8,180 జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. ఏకంగా వేలు కాదు లక్షల్లో దరఖాస్తు చేసుకున్నారు. 9 లక్షల 51 వేల మంది వీటి కోసం పోటీ పడుతున్నారు. ఒక్కో ఉద్యోగానికి కనీసం 118 దాకా పోటీ పడడం విశేషం. పరీక్ష రెండు పేపర్లు ఉంటాయి.
Also Read : PM Modi Gifts : బైడెన్ దంపతులకు మోదీ కానుకలు