PM Modi Wishes : ఈజిప్టు యోగా శిక్షకులకు మోదీ ప్రశంస
ప్రధానిని కలిసిన నాడా అడెల్..రీమ్ జబక్
PM Modi Wishes : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈజిప్టు దేశంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో టూర్ ముగించింది. ప్రపంచ వ్యాప్తంగా యోగాను విశ్వ వ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషించారు ప్రధానమంత్రి. ఆయన ఎప్పుడైతే 2014లో ప్రధానిగా కొలువు తీరారో ఆనాటి నుంచి పెద్ద ఎత్తున యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు. అంతే కాదు ఐక్య రాజ్య సమితిలో భారత దేశం యోగాను అంతర్జాతీయ దినంగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రతిపాదించిన తీర్మానానికి ఓకే చెప్పింది యుఎన్ఓ. ఓటింగ్ నిర్వహించగా మొత్తం 193 దేశాలకు గాను 173 దేశాలు బేషరతుగా మూకుమ్మడిగా యోగాకు జై కొట్టాయి.
భారత దేశానికి సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ప్రతి ఏటా జూన్ 21న వరల్డ్ వైడ్ గా యోగా డేగా నిర్వహించారు. ఈసారి అరుదైన అవకాశం దక్కింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి. ఐక్య రాజ్య సమితిలో యోగా దినోత్సవం సందర్బంగా నిర్వహించిన యోగా సెషన్ కు పీఎం నాయకత్వం వహించారు. భారత దేశ చరిత్రలో ఒక ప్రధాన మంత్రికి(PM Modi) ఇలాంటి అవకాశం దక్కడం తొలిసారి కావడం విశేషం. ఇదిలా ఉండగా ఈజిప్టులో యోగాను ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ఇద్దరు మహిళలు.
వారు ఎవరో కాదు ఒకరు నాడా అడెల్ మరొకరు రీమ్ జబక్. విపరీతమైన జనాదరణ పొందేలా యోగాను చేశారు. ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈజిప్టు పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నాడా అడెల్, రీమ్ జబక్ కలుసుకున్నారు. ఈ సందర్బంగా మోదీ వారిని ప్రత్యేకంగా అభినందించారు.
Also Read : Egyptian Woman Signs : ‘షోలే’ పాటకు మోదీ ఫిదా