Wasim Jaffer : బీసీసీఐ జట్ల ఎంపికపై జాఫర్ ఫైర్
టెస్టు, వన్డే జట్ల సెలెక్షన్ పై గరం
Wasim Jaffer : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్న చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికి పోయాడు. ఆపై ఆయన చేసిన ఎంపికకు సంబంధించిన కామెంట్స్ కలకలం రేపాయి. ప్రధానంగా సంజూ శాంసన్ గురించి నోరు పారేసుకున్నాడు. ఈ తరుణంలో సెలెక్షన్ కమిటీ వ్యవహారం తీవ్ర దుమారానికి దారి తీసేలా చేసింది. ఇక ప్రపంచ క్రికెట్ రంగంలో బీసీసీఐ అత్యధిక ఆదాయం కలిగిన సంస్థగా పేరు పొందింది. దీంతో జే షా ఏం చెబితే వాళ్లే జట్టులో ఉంటారన్న విమర్శలు లేక పోలేదు.
ఇదిలా ఉండగా వచ్చే జూలై లో భారత జట్టు విండీస్ లో పర్యటించనుంది. ఇదిలా ఉండగా టెస్టు , వన్డే జట్లను ఎంపిక చేసింది బీసీసీఐ. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశీ వాలీ పోటీల్లో అద్భుతంగా ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ను ఎందుకు టెస్టు జట్టుకు ఎంపిక చేయలేదని పెద్ద ఎత్తున మండి పడ్డారు మాజీ క్రికెటర్ వసీం జాఫర్(Wasim Jaffer).
ఏకంగా నలుగురు ఓపెనర్లను ఎలా తీసుకున్నారని నిప్పులు చెరిగాడు. సర్ఫరాజ్ ఖాన్ మిడిల్ ఆర్డర్ లో పని కొస్తాడని అతడిని కావాలని పక్కన పెట్టారంటూ ఫైర్ అయ్యాడు. విచిత్రం ఏమిటంటే మహ్మద్ షఫీన్ ఎందుకు తొలగించారని ప్రశ్నించాడు. అతడిని ఎంపిక చేసి ఉంటే వచ్చే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు పనికి వచ్చే వాడంటూ అభిప్రాయపడ్డాడు జాఫర్.
Also Read : PM Modi Conferred : మోదీకి అత్యున్నత పురస్కారం
