Rahul Gandhi : రాహుల్ గాంధీ వైర‌ల్

నెట్టింట్లో హ‌ల్ చ‌ల్

Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. చిన్నారుల నుంచి వృద్దుల దాకా యువ నాయ‌కుడిని ఆద‌రిస్తున్నారు. మోస్ట్ పాపుల‌ర్ నాయ‌కుల‌లో ఒక‌డిగా గుర్తింపు పొందారు రాహుల్ గాంధీ. ఇందులో భాగంగా ఆయ‌న నాయ‌కుడిగా కాకుండా సామాన్యుడిలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న చేతల‌తో ఎంద‌రో మ‌న‌సుల్ని దోచుకుంటున్నారు. మొన్న‌టికి మొన్న ట్ర‌క్ లో ప్ర‌యాణం చేశారు. డ్రైవ‌ర్ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు.

ఇక ఢిల్లీలో బైక్ మెకానిక్ లు ప‌ని చేసే వాళ్ల వ‌ద్ద‌కు వెళ్లారు. మెకానిక్ ల‌తో ముచ్చ‌టించారు. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. మ‌రో వైపు ఢిల్లీ నుండి సిమ్లా వ‌ర‌కు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రైలు ఎక్కారు. ఆపై డ్రైవ‌ర్ ముచ్చ‌టించారు. వారి స‌మ‌స్య‌ల్ని సావ‌ధానంగా విన్నారు.

గురువారం కాంగ్రెస్ పార్టీ ట్విట్ట‌ర్ వేదిక‌గా అరుదైన ఫోటోను షేర్ చేసింది. ఇందులో సాధార‌ణ ప్ర‌యాణికుడిగా బ‌స్సులో ప్ర‌యాణం చేశారు. అనుకోకుండా రాహుల్ గాంధీ(Rahul Gandhi) బ‌స్సులో జ‌ర్నీ చేయ‌డంతో అందులో ప్ర‌యాణం చేస్తున్న వారంతా విస్మ‌యానికి గుర‌య్యారు. యువ‌తి ఫోన్ లో మాట్లాడుతూ త‌న త‌ల్లితో ఆనందాన్ని పంచుకుంది. రాహుల్ గాంధీ తో పాటు తాను కూడా బ‌స్సులో వ‌చ్చాన‌ని తెలిపింది. నిజ‌మైన నాయ‌కులు ఆర్భాటాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ఇష్ట‌ప‌డ‌రు. సింపుల్ గా ఉండేందుకు ప్ర‌యారిటీ ఇస్తారు.

Also Read : RS Praveen Kumar : ఆదివాసీ బిడ్డ‌లపై కేసీఆర్ వివ‌క్ష

 

Leave A Reply

Your Email Id will not be published!