Ambati Rambabu BRO Movie : బ్రో సినిమాపై అంబ‌టి ఫిర్యాదు

అక్ర‌మ ప‌ద్ద‌తుల్లో ఫండింగ్

Ambati Rambabu BRO Movie : ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. బుధ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. త‌మిళ సినీ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో బ్రో ది అవ‌తార్ సినిమాను జూలై 28న విడుద‌ల చేశారు. కేవ‌లం నాలుగు రోజుల‌కే రూ. 107 కోట్ల‌కు పైగా సినిమా వ‌సూళ్లు సాధించింది. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Ambati Rambabu BRO Movie Issue

దీనిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు అంబ‌టి రాంబాబు(Ambati Rambabu). బ్రో సినిమాకు సంబంధించి మూవీ మేక‌ర్స్ చెబుతున్న‌వ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలంటూ ఆరోపించారు. కేవ‌లం కోట్ల 30 ల‌క్ష‌లు మాత్ర‌మే క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయ‌ని, పూర్తిగా మూవీ అట్ట‌ర్ ప్లాప్ అంటూ ఎద్దేవా చేశారు ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు.

అంతే కాదు సినిమాకు సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేశారు. బ్రో సినిమాకు అక్ర‌మ ప‌ద్ద‌తుల్లో ఫండింగ్ జ‌రిగింద‌ని ఆరోపించారు. బ్రో మూవీ లావా దేవీల‌పై తాము ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు అంబ‌టి రాంబాబు. పార్టీ ఎంపీల‌తో క‌లిసి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు తాము ఆధారాల‌తో స‌హా ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. అయితే వైఎస్సార్ సీపీ ఎంపీ , పార్టీ అధికార ప్ర‌తినిధి విజ‌య సాయి రెడ్డితో భేటీ అనంత‌రం ఫిర్యాదు చేస్తామ‌ని వెల్ల‌డించారు అంబ‌టి రాంబాబు.

Also Read : Nitin Desai : ఆర్ట్ డైరెక్ట‌ర్ నితిన్ దేశాయ్ సూసైడ్

Leave A Reply

Your Email Id will not be published!