RTC Bill Governor : ఆర్టీసీ బిల్లును ఆమోదించని గవర్నర్
తనకు క్లారిటీ కావాలన్న తమిళి సై
RTC Bill Governor : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆర్టీసీ విలీనం ప్రక్రియకు ఇంకా ఆమోదం లభించ లేదు. ఆర్టీసీని సర్కార్ లో విలీనం చేస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఈ మేరకు తన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు క్యాబినెట్ సైతం పూర్తి సమ్మతి తెలియ చేసింది.
RTC Bill Governor Status
దీనికి సంబంధించిన అంశం గురించి మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సామాజిక బాధ్యత కింద ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని, ఈ మేరకు ప్రస్తుతం సంస్థలో పని చేస్తున్న 43 వేల మంది ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా అవుతారని స్పష్టం చేశారు.
శాసనసభ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లు తీసుకు వస్తామని చెప్పారు. అన్నట్టుగానే ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టింది. ఈ మేరకు దానిని ఆమోదించేందుకు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్(RTC Bill Governer) కు పంపించింది.
దానిపై ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీనిపై ఇంకా తనకు క్లారిటీ రావల్సి ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై పేర్కొన్నట్లు సమాచారం. మొత్తంగా అటు సర్కార్ ఇటు గవర్నర్ మధ్య మరోసారి ఆర్టీసీ బిల్లు రాజకీయ వివాదానికి దారి తీసేలా ఉంది.
Also Read : Punganuru Row : రణరంగంగా మారిన పుంగనూరు
