Nara Lokesh : ఏపీలో పాలన పడకేసిందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి రాచరిక పాలన సాగిస్తున్నాడంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh). యువ గళం పాదయాత్ర లో భాగంగా ఆయన ప్రసంగించారు. ఇప్పటి వరకు 2,600 కిలోమీటర్లు పూర్తి చేశారు.
Nara Lokesh Slams YS Jagan
రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను నిట్ట నిలువునా మోసం చేస్తున్నాడని ఆవేదన చెందారు. ఇదే సమయంలో ఆటో రిక్షా డ్రైవర్లకు నెలకు 10 వేల రూపాయలు ఇచ్చి ఏడాది పొడవునా లక్ష రూపాయలు దోచేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.
టీడీపీ హయాంలో పోలీసులు చోరీలను చేసే వారిని పట్టుకునే వారని, లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసే వారని కానీ జగన్ రెడ్డి పాలనలో తేబాదారులుగా మారి పోయారని మండిపడ్డారు. అంతే కాదు ఖాకీలను ఫోటోగ్రాఫర్లుగా మార్చేసిన ఘనత ఈ సీఎంకే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు.
రాబోయే కాలంలో జనం జగన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదన్నారు. తాము కచ్చితంగా పవర్ లోకి వస్తామని ఆటో రిక్షా డ్రైవర్లకు మేలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్.
Also Read : SRI SRI SRI Swaroopanada Swamy : స్వామీ స్మరామీ