KL Rahul : రెండు మ్యాచ్ ల‌కు రాహుల్ దూరం

నేపాల్, పాకిస్తాన్ తో జ‌రిగే మ్యాచ్ లు

KL Rahul : ఆసియా క‌ప్ 2024 టోర్నీ ప్రారంభం కానున్న త‌రుణంలో బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏరి కోరి బీసీసీఐ కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసింది. ఇప్ప‌టికే ఐపీఎల్ లో గాయ ప‌డ‌డంతో చికిత్స తీసుకున్నాడు. కోలుకోవ‌డంతో బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసింది.

KL Rahul Rest for Two Matches

ఇదిలా ఉండ‌గా ఉన్న‌ట్టుండి జ‌ట్టుకు సంబంధించి రెండు మ్యాచ్ లకు కేఎల్ రాహుల్ దూరంగా ఉంటాడ‌ని బీసీసీఐ తాజాగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే మాజీ , తాజా క్రికెట‌ర్లు, సీనియ‌ర్లు రాహుల్ ను ఎంపిక చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు.

ఎవ‌రిని ఉద్ద‌రించేందుకు ప‌దే ప‌దే గాయ‌ప‌డుతున్న రాహుల్(KL Rahul) కు ఛాన్స్ ఇస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. గాయం నుంచి కోలుకోకుండానే ఎలా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేశారంటూ నిల‌దీస్తున్నారు. అయితే ఆసియా క‌ప్ టోర్నీ ఆగ‌స్టు 30 బుధ‌వారం నుండి ప్రారంభం కానుంది.

ఇందులో ఆరు జ‌ట్లు ఆడ‌నున్నాయి. ఈ టోర్నీ హైబ్రిడ్ ప‌ద్ద‌తిలో కొన‌సాగుతోంది. నేపాల్, పాకిస్తాన్ తో జ‌రిగే మ్యాచ్ ల‌కు కేఎల్ రాహుల్ ఆడ‌డం లేద‌ని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. జ‌ట్టు ప‌రంగా రిజ‌ర్వ్ ఆట‌గాడిగా కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ ను ఎంపిక చేసింది.

Also Read : Asia Cup 2023 : ఆసియా క‌ప్ యుద్దానికి సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!