Vijaya Shanti : బీసీలకు ప్రయారిటీ ఇవ్వాలి
విజయ శాంతి కీలక కామెంట్స్
Vijaya Shanti : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, ప్రముఖ నటి విజయ శాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు అత్యధికంగా ఉన్నారని కానీ ఏ ఒక్క పార్టీ వారి గురించి ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Vijaya Shanti said Seats Bifurcation
మన కోటా మన వాటా అన్నది తప్పకుండా అమలు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు విజయ శాంతి(Vijaya Shanti). బుధవారం ఆమె ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం చూస్తే కనీసం 119 సీట్లలో 50 నుంచి 60 సీట్లు బీసీలకు ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేశారు.
వాళ్లకు కూడా రాజకీయ అధికారంలో వాటా ఉండ కూడదా అని ప్రశ్నించారు. రేపొద్దున జరిగే శాసనసభ ఎన్నికలలో బీసీలు నిర్ణయాధికారం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. వాళ్లు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీలకు అదనపు బాలంగా మారే ఛాన్స్ ఉందని అన్నారు విజయ శాంతి.
బీసీలకు టికెట్ల కేటాయింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ కనీస ధర్మాన్ని కూడా పాట్టించ లేదని ఆరోపించారు. ఇది పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. జనాభాను పరిగణలోకి తీసుకుని తెలంగాణ లోని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు విజయశాంతి.
Also Read : CJI Chandrachud : కేంద్రాన్ని ప్రశ్నించిన సీజేఐ