Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లు

స్వామి వారిని ద‌ర్శించుకున్న భ‌క్తులు 64,214

Tirumala Hundi : ప‌విత్ర పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌లో కొలువై ఉన్న శ్రీ‌నివాసుడు, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు బారులు తీరారు. క‌లియుగ దైవంగా కోట్లాది మంది భావిస్తారు. కొలుస్తారు, త‌మ ఇష్ట దైవంగా భావిస్తారు.

Tirumala Hundi Collections

కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి పేరుంది. చిన్నారుల నుంచి పెద్ద‌ల దాకా తిరుమ‌ల బాట ప‌ట్టారు. గ‌త కొన్ని నెల‌లుగా కంటిన్యూగా స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు పోటెత్తుతున్నారు. ఇందులో భాగంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) ఏర్పాట్లు చేస్తోంది.

నిన్న స్వామి వారిని 64 వేల 214 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. ఎప్ప‌టి లాగే స్వామి వారికి స‌మ‌ర్పించే త‌ల‌నీలాల భ‌క్తుల సంఖ్య 25 వేల 777 కు చేరుకుంది. భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం ర‌. 4.05 కోట్లు వ‌చ్చాయ‌ని టీటీడీ వెల్ల‌డించింది.

స్వామి వారి ద‌ర్శ‌నం కోసం తిరుమ‌ల లోని 15 కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 12 గంట‌ల‌కు పైగా ప‌డుతుంద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తెలిపింది.

ఇదిలా ఉండగా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స‌క‌ల ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి. మ‌రో వైపు సామాన్య‌ల‌కు ప్ర‌యారిటీ ఇస్తామ‌ని , తిరుమ‌ల అభివృద్దే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నామ‌ని పేర్కొన్నారు టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.

Also Read : Vijaya Shanti : బీసీల‌కు ప్ర‌యారిటీ ఇవ్వాలి

Leave A Reply

Your Email Id will not be published!