Paritala Ravindra : ప‌రిటాల ర‌వీంద్ర‌ చెర‌గ‌ని ముద్ర‌

ప‌రిటాల ర‌వీంద్ర జ‌యంతి ఆగ‌స్టు 30

Paritala Ravindra : ఉమ్మ‌డి ఏపీ రాజ‌కీయాల‌లో మ‌రిచిపోని నాయ‌కుడు ప‌రిటాల ర‌వీంద్ర‌. ఆగ‌స్టు 30 ఆయ‌న పుట్టిన రోజు. 1958లో పుట్టిన ర‌వి జ‌న‌వ‌రి 24న 2005లో దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. తెలుగుదేశం పార్టీలో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఎదిగారు. ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు.

ప‌రిటాల పేరు ఓ బ్రాండ్ గా మార్చేసిన ఘ‌న‌త ర‌విదే. ఆయ‌నతో పాటు అనుచ‌రుడిగా పేరు పొందిన చ‌మ‌న్ ఇప్పుడు లేడు. ర‌వి పుట్టింది అనంత‌పురం జిల్లా రామ‌గిరి మండ‌లం వెంక‌టాపురం. భార్య ప‌రిటాల సునీత‌. కొడుకు ప‌రిటాల శ్రీ‌రామ్.

Paritala Ravindra Life Story

ప‌రిటాల ర‌వి తండ్రి ప‌రిటాల శ్రీ‌రాములు ప్ర‌జా నాయ‌కుడు. ఆనాడు భూస్వాముల చేతుల్లో ఉన్న బంజ‌రు భూముల‌ను సాధార‌ణ రైతుల‌కు పంచి పెట్టాడు. ఆయ‌న కూడా ప్ర‌త్య‌ర్థుల చేతుల్లో హ‌త్య‌కు గుర‌య్యాడు. శ్రీ‌రాములు జీవిత క‌థ ఆధారంగా శ్రీ‌రాముల‌య్య సినిమా తీశాడు ఎన్. శంక‌ర్. వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ర‌క్త చ‌రిత్ర పేరుతో ప‌రిటాల ర‌వీంద్ర(Paritala Ravindra) పేరు మీద చిత్రం తీశాడు.

ర‌వి త‌మ్ముడు హ‌రి బూట‌క‌పు ఎన్ కౌంట‌ర్ లో మ‌ర‌ణించాడు. ఫ్యాక్ష‌నిస్టులు ర‌విని వేధించ‌డం మొద‌లు పెట్టారు. దీంతో విప్ల‌వం వైపు ఆక‌ర్షితుడ‌య్యాడు. శ్రీ‌రాముల‌ను చంపిన మాజీ ఎమ్మెల్యేను నారాయ‌ణ రెడ్డిని పీపుల్స్ వార్ కాల్చి చంపింది. ఈ హ‌త్య కేసులో ర‌విని ముద్దాయిగా చేర్చింది.

1983లో టీడీపీ ప‌వర్ లోకి వ‌చ్చింది. 1984లో త‌న ఊరుకు చేరుకున్నాడు ప‌రిటాల ర‌వీంద్ర‌(Paritala Ravindra). కొండ‌ప‌ల్లితో సాంగ‌త్యం ఏర్ప‌డింది. 1992లో ఎస్పీ ఎదుట లొంగి పోయాడు ర‌వి. ధ‌ర్మ‌వ‌రంలో ఓబుల్ రెడ్డి అరాచ‌కాల‌ను ఎదిరించిన మ‌స్కిన్ ర‌వి అనుచ‌రుడు. ఆయ‌న‌ను మ‌ట్టుబెట్టారు ప్ర‌త్య‌ర్థులు.
1993 జూన్ 7న ప‌రిటాల టీడీపీలో చేరాడు. వేలాది మంది ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

అక్టోబ‌ర్ 24న మ‌ద్ద‌ల చెర‌వు గ్రామంలో టీవీ బాంబు ఘ‌ట‌న చోటు చేసుకుంది. 1994 జూన్ 17న వైఎస్ రాజా రెడ్డి వెంక‌టాపురంకు వెళ్లాడు. ప‌రిటాల ర‌వీంద్ర‌ను క‌లుసుకున్నాడు. షాద్ న‌గ‌ర్ లో జంట హ‌త్య‌లు జ‌రిగాయి. ఈ కేసులో ర‌వి ముద్దాయిగా చేర్చారు. జైలు నుంచే ర‌వి నామినేష‌న్ వేశాడు.

అత్య‌ధిక మెజారిటీ సాధించి గెలుపొందాడు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రి అయ్యాడు. ఆ త‌ర్వాత అనంత‌పురం జిల్లాను , రాయ‌ల‌సీమ‌ను శాసించాడు. త‌న తండ్రి సినిమా సంద‌ర్భంగా దాడి జ‌రిగింది. తృటిలో త‌ప్పించుకున్నాడు ర‌వీంద్ర‌.

2003లో సామూహిక జంట‌ల‌కు పెళ్లిళ్లు చేశాడు. ఆ త‌ర్వాత టీడీపీ ఓట‌మి పాలైంది. కాంగ్రెస్ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. చ‌మ‌న్ అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. త‌నకు ర‌క్ష‌ణ క‌ల్పించ‌మ‌ని కోరాడు. త‌న‌ను చంపేందుకు జ‌గ‌న్ కుట్ర ప‌న్నారంటూ ఆరోపించాడు.

2005 జ‌న‌వ‌రి 24న అనంత‌పురం పార్టీ ఆఫీసులో అంద‌రి స‌మ‌క్షంలో ర‌విని కాల్చి చంపారు. ఆయ‌న‌పై బుల్లెట్ల వ‌ర్షం కురిపించారు. పేద‌ల కోసం క‌ష్ట‌ప‌డిన ప్ర‌జా నాయ‌కుడిగా గుర్తింపు పొందారు ర‌వీంద్ర‌.

Also Read : Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!