Asia Cup 2023 Ceremony : ఆక‌ట్టుకున్న ఆసియా క‌ప్ సంబురం

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Asia Cup 2023 Ceremony : ఆసియా క‌ప్ సంబురం అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా నేపాల్ దేశానికి చెందిన ప్ర‌ముఖ సింగ‌ర్ త్రిషాలా గురుంగ్ పాల్గొన్నారు. త‌న అద్భుత‌మైన పాట‌ల‌తో అల‌రించారు. క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

త్రిషాలా గురుంగ్ ముల్తాన్ ప్రేక్ష‌కులు త‌న్మ‌య‌త్వానికి లోన‌య్యారు. ఆసియా క‌ప్(Asia Cup 2023 Ceremony) హైబ్రిడ్ ప‌ద్ద‌తిలో కొన‌సాగుతోంది. ఆరు మ్యాచ్ ల‌కు పాకిస్తాన్ , 9 మ్యాచ్ ల‌కు శ్రీ‌లంక ఆతిథ్యం ఇస్తోంది. గ్రాండ్ ఓపెనింగ్ కార్య‌క్ర‌మం న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో సాగింది. పాకిస్తాన్ లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో ఘ‌నంగా జ‌రిగింది.

Asia Cup 2023 Ceremony Viral

నేపాల్ సింగర్ త్రిషాలా గురుంగ్ తో పాటు పాకిస్తాన్ దేశానికి ప్ర‌ముఖ గాయ‌ని ఐమా బేగ్ త‌మ పాట‌ల‌తో అల‌రించే ప్ర‌య‌త్నం చేశారు. త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో మంత్ర‌ముగ్ధుల‌ను చేశారు. ఇదిలా ఉండ‌గా పాకిస్తానీ క్రికెట్ ప్రేక్ష‌కుల‌కు బేగ్ కొత్తేమీ కాదు..గ‌తంలో పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్) కోసం గీతాలు పాడారు. గురుంగ్ స్థానిక అభిమానుల‌ను అల‌రించేలా చేసింది.

ఆమె మ‌నోహ‌ర‌మైన వాయిస్ ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది. మొత్తంగా త్రిషాలా గురుంగ్ , ఐమా బేగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.

ఆమె మనోహరమైన వాయిస్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది మరియు ఆమె తక్షణమే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Also Read : RS Praveen Kumar : దొర‌ల రాజ్యం బ‌హుజ‌నుల‌కు శాపం

Leave A Reply

Your Email Id will not be published!