PM Modi : మాన‌వ సాధికార‌త ముఖ్యం

పిలుపునిచ్చిన ప్ర‌ధాని మోదీ

PM Modi : జ‌కార్తా – ఇండోనేషియా లోని జ‌కార్తాలో జ‌రుగ‌తుఉన్న తూర్పు ఆసియా స‌ద‌స్సులో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వివిధ దేశాధి నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన కీల‌క స‌మావేశంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు.

PM Modi Participate East Asia Summit

ఇవాళ యావ‌త్ ప్ర‌పంచాన్ని ఉగ్ర‌వాదం స‌వాల్ గా మారింద‌న్నారు. ఈ స‌మ‌యంలో మ‌రింత మాన‌వ సాధికార‌త కోసం ప్ర‌య‌త్నం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త దేశం శాంతికి , సామార‌స్య‌త‌కు క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు న‌రేంద్ర మోదీ.

కీల‌క రంగాల‌లో స‌న్నిహిత స‌హ‌కారాన్ని పెంపొందించు కోవ‌డంపై అన్ని దేశాలు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi). ఉత్పాద‌క చ‌ర్చ‌లు జ‌ర‌పాలని సూచించారు మోదీ. రోజు రోజుకు టెక్నాల‌జీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని, దానిని మాన‌వ స‌మాజానికి అన్వ‌యించు కోవాల‌ని హిత‌వు ప‌లికారు.

దేశాల మ‌ధ్య సత్ సంబంధాలు పెంపొందించుకునే దిశ‌గా ప్ర‌తి ఒక్క‌రం క‌ట్టుబ‌డి ఉండాల‌న్నారు. వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ఒక‌దానితో మ‌రొక‌టి పెనవేసుకుంటూ ముందుకు పోవాల‌ని కోరారు న‌రేంద్ర మోదీ. ఇది అంద‌రి ల‌క్ష్యంగా మారాల‌న్నారు.

Also Read : BJP Tamilnadu : ఉద‌య‌నిధిపై గవ‌ర్న‌ర్ కు ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!