BJP Tamilnadu : ఉద‌య‌నిధిపై గవ‌ర్న‌ర్ కు ఫిర్యాదు

ఆయ‌నను కేబినెట్ నుంచి తొల‌గించాలి

BJP Tamilnadu : త‌మిళ‌నాడు – సీఎం ఎంకే స్టాలిన్ త‌న‌యుడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా హిందూ వ‌ర్గాలు, సంస్థ‌లు నిప్పులు చెరుగుతున్నాయి. స్వాములు సైతం భ‌గ్గుమంటున్నారు. మ‌రో వైపు బీజేపీ ఉద‌య‌నిధిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది.

BJP Tamilnadu Raised a Complaint on Udhayanidhi Stalin

ఈ మేర‌కు గురువారం త‌మిళ‌నాడు బీజేపీకి(BJP Tamilnadu) చెందిన సీనియ‌ర్ నాయ‌కులు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌విని క‌లుసుకున్నారు. మంత్రి ఉద‌య‌నిధి రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా, ఒక వ‌ర్గానికి చెందిన వారి మ‌నోభావాలు దెబ్బ తినేలా కామెంట్స్ చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రాజ్యాంగ బ‌ద్ద‌మైన ప‌ద‌విలో ఉన్న గ‌వ‌ర్న‌ర్ వెంట‌నే కేబినెట్ నుంచి మంత్రిగా ఉన్న ఉద‌య‌నిధి స్టాలిన్ పై పోలీసులు కేసులు న‌మోదు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఈ మేర‌కు ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేయాల‌ని కోరారు.

ఈ మేర‌కు బీజేపీ రాష్ట్ర నేత‌లు ఆర్ఎన్ ర‌వికి వినతిప‌త్రం స‌మ‌ర్పించారు. ఇదిలా ఉండ‌గా స‌నాత‌న ధ‌ర్మం గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఉద‌య‌నిధి స్టాలిన్. అది డెంగ్యూ, మ‌లేరియా కంటే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని హెచ్చ‌రించారు. దాని గురించి వ్య‌తిరేకంగా మాట్లాడ‌క పోయినా ప‌ర్వాలేదు. కానీ స‌మూలంగా నిర్మూలించాల‌ని పిలుపునిచ్చారు.

Also Read : Gauri Lankesh : గౌరీ లంకేశ్ కు నివాళి

Leave A Reply

Your Email Id will not be published!