AP Politics Comment : ఆధిప‌త్య పోరులో గెలుపెవ‌రిది..?

చంద్ర‌బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్ రెడ్డి

AP Politics Comment : ఒక‌ప్పుడు పాలిటిక్స్ కు విలువ‌లు ఉండేవి. కానీ రాను రాను రాజ‌కీయాలు అంటేనే రోత పుట్టించేలా త‌యార‌య్యాయి. ఇది ప‌క్క‌న పెడితే ఏపీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు మ‌రింత ఆస‌క్తిని, ఇంకింత ఉత్సుకత‌ను క‌లిగించేలా చేశాయి. ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఓ వైపు జి20 స‌ద‌స్సు జ‌రుగుతోంది. మ‌రో వైపు 40 ఏళ్ల రాజ‌కీయ నేప‌థ్యం క‌లిగిన సీబీఎన్ ను అదుపులోకి తీసుకోవ‌డం మామూలు విష‌యం కాదు. ఆ మ‌ధ్య‌న ల‌క్ష కోట్లు నా ఆస్తి అని ప్ర‌క‌టించిన నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు. ఆ మాట స్వ‌యంగా ఆయ‌నే తెలిపారు. త‌న‌కు ఎదురే లేద‌ని ముందు నుంచీ అనుకుంటూ వ‌చ్చారు. విచిత్రం ఏమిటంటే త‌ను మ‌రోసారి ఏపీకి సీఎం అవుతాన‌ని అనుకున్నారు. కానీ సీన్ మారింది. జ‌నం కోలుకోలేని షాక్ ఇచ్చారు. వైసీపీ పార్టీకి భారీ స‌క్సెస్ క‌ట్ట‌బెట్టారు.

AP Politics Comment Viral

ఎప్పుడైతే అధికారంలోకి వ‌చ్చాడో వైసీపీ బాస్, సీఎం జ‌గ‌న్ రెడ్డి(CM YS Jagan) మెల మెల్ల‌గా చాప కింద నీరులా ప‌ని చేసుకుంటూ వెళ్ల‌డం స్టార్ట్ చేశాడు. త‌ను కూడా అవినీతి, అక్ర‌మాల‌కు సంబంధించి 16 నెల‌ల పాటు జైలుకు వ‌చ్చిన వ్య‌క్తి. త‌న క‌ళ్ల‌ల్లో ఆనందం కోసమే చంద్ర‌బాబు నాయుడుని అరెస్ట్ చేయించాడంటూ టీడీపీ(TDP) సీనియ‌ర్ నాయ‌కులు ఆరోపించ‌డం ఒకింత ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. ఉమ్మ‌డి ఏపీలో చంద్ర‌బాబు నాయుడు త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చాడు. ఆపై దేశ రాజ‌కీయాల‌ను కూడా శాసించాడు. నిత్యం అభివృద్ది మంత్రం జ‌పించే చంద్ర‌బాబు నాయుడు క‌ల‌లో కూడా అనుకోని ఉండ‌డు త‌న‌ను అదుపులోకి తీసుకుంటార‌ని. వ్య‌వ‌స్థ‌ల‌ను మ్యానేజ్ చేయ‌డంలో చంద్రబాబు నాయుడు త‌ర్వాతే ఎవ‌రైనా అన్న పేరు కూడా సంపాదించుకున్నారు. రాజ‌కీయాల్లో రాణించాలంటే ద‌మ్ముండాలి. అంత‌కు మించి నైపుణ్యం, మెల‌కువ‌లు క‌లిగి ఉండాలి.

చంద్ర‌బాబు నాయుడుకు జ‌గ‌న్ రెడ్డి కంటే ముందు ఝ‌ల‌క్ ఇచ్చింది మాత్రం బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న‌కు ఎదురే లేద‌ని అనుకుంటూ వ‌చ్చిన బాబుకు బిగ్ షాక్ ఇచ్చాడు. తెలంగాణ ఉద్యమానికి శ్రీ‌కారం చుట్టి.. ఏకంగా రాష్ట్రం సాధించి ..ప‌వ‌ర్ లోకి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత రేవంత్ రెడ్డి ద్వారా ఓటుకు నోటు కేసులో బాబు పేరు వ‌చ్చింది. ఆ త‌ర్వాత అప్ప‌టి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ జోక్యం చేసుకోవ‌డంతో చంద్రబాబు, కేసీఆర్ రాజీకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం వైసీపీ జెండా ఎగ‌ర‌డం , భారీ మెజారిటీ ద‌క్క‌డంతో జ‌గ‌న్ త‌న ప్లాన్ ను అమ‌లు చేసుకుంటూ పోయాడు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపించాడు. త‌న భార్య‌ను అవ‌మానించారంటూ బాబు క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి అంత మైలేజ్ రాలేదు.

ఆ త‌ర్వాత ఎక్క‌డా త‌ల వంచ లేదు చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu). మ‌ళ్లీ జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. ఓ వైపు జ‌న‌సేన పార్టీ చీఫ్ తో క‌లిసి ముందుకు సాగే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ త‌రుణంలో ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకోవ‌డాన్ని త‌ను కూడా ఊహించ లేదు. త‌న జీవిత కాలంలో ఎన్నో మైలు రాళ్లు చ‌వి చూసిన చంద్ర‌బాబు చివ‌ర‌కు కోర్టు మెట్లు ఎక్కారు. జ‌డ్జి ముందు త‌న వాద‌న‌లు వినిపించారు. త‌ను ఆదేశించ‌డ‌మే త‌ప్ప ఇంకొక‌రి ఆదేశాలు వినేందుకు ఇష్ట‌ప‌డ‌ని చంద్ర‌బాబుకు రాజ‌కీయం అంటే ఏమిటో స్వ‌యంగా అర్థ‌మై ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల కామెంట్స్ . రాబోయే రోజుల్లో మ‌రింత థ్రెట్ త‌ప్ప‌క ఉంటుంద‌ని అనుకోవ‌డానికి వీలు లేదు. ఏది ఏమైనా జ‌గ‌న్ , చంద్ర‌బాబు మ‌ధ్య చోటు చేసుకున్న ఆధిప‌త్య పోరులో ఎవ‌రు గెలిచారనేది కాల‌మే స‌మాధానం చెప్పాలి.

Also Read : Komatireddy Venkat Reddy : కోమ‌టిరెడ్డికి హైక‌మాండ్ ఝ‌ల‌క్

Leave A Reply

Your Email Id will not be published!