Congress Vijayabheri : జనమే జనం కాంగ్రెస్ ప్రభంజనం
తుక్కుగూడలో విజయ భేరి విజయవంతం
Congress Vijayabheri : హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ భేరి సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆ పార్టీ నేతలు సైతం ఊహించని రీతిలో స్వచ్చంధంగా జనం తరలి రావడం ఒకింత ఆశ్చర్యాన్ని కలుగ జేసింది.
అశేష జనవాహిని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపింది. ఒక రకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మరింత బలాన్ని ఇచ్చినట్లయింది. రాష్ట్రంలో కొలువు తీరిన ప్రభుత్వం పట్ల ప్రజలు నిశ్శబ్దంగా ఇంతటి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారా అన్న అనుమానం కలుగక మానదు.
Congress Vijayabheri Viral
విజయ భేరి సందర్భంగా సోనియా గాంధీ తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ (హామీలు)లను అమలు చేస్తామని ప్రకటించారు. ఇందులో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ. 2,500 ఇస్తామని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ప్రకటించారు సోనియా గాంధీ. రైతు భరోసా కింద రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని తెలిపారు.
ఇక గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కింద ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం కేటాయిస్తామన్నారు.
యువ వికాసం కింద విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. చేయూత కింద నెలకు రూ. 4,000 చొప్పున పింఛను. రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Also Read : Rahul Gandhi : తెలంగాణను లూటీ చేసిన కేసీఆర్