Rajinikanth Thanks : బీసీసీఐకి రజనీకాంత్ థ్యాంక్స్
గోల్డెన్ టికెట్ ఇచ్చినందుకు
Rajinikanth Thanks : తమిళనాడు – ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని ప్రశంసలతో ముంచెత్తాడు సూపర్ స్టార్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే వరల్డ్ కప్ 2023కు భారత దేశం ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసింది. హైబ్రిడ్ పద్దతిలో దీనిని నిర్వహిస్తున్నారు.
Rajinikanth Thanks to BCCI
ఇందులో భాగంగా దేశానికి చెందిన ప్రముఖులు, వ్యాపార, వాణిజ్య, సినీ రంగాలకు చెందిన వారికి బీసీసీఐ ప్రత్యేకించి గోల్డెన్ టికెట్ లను అందజేస్తూ వస్తోంది. తొలుత బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు స్వయంగా వెళ్లి బీసీసీఐ సెక్రటరీ జే షా ఇచ్చారు.
తాజాగా తలైవా(Rajinikanth) నివాసానికి వెళ్లారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తనయుడు జే షా. ప్రస్తుతం కోట్లాది రూపాయలు కలిగి ఉన్న బీసీసీఐ ఆయన చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా వరల్డ్ కప్ ను నిర్వహిస్తోంది. ఈ మేరకు గోల్డెన్ టికెట్ ను రజనీకాంత్ కు అందజేశారు.
ఈ సందర్బంగా సూపర్ స్టార్ సంతోషానికి లోనైనట్లు తెలిపారు. జేషా కు , బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Green Metro Luxury Buses : గ్రీన్ మెట్ర్ లగ్జరీ బస్సులు స్టార్ట్