Jennifer Larson : వ్యాపారానికి హైదరాబాద్ స్వర్గధామం
యుఎస్ కాన్సులేట్ జనరల్ లార్సన్
Jennifer Larson : హైదరాబాద్ – హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిపర్ లార్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఇంటర్నేషనల్ పార్క్ లో ప్రపంచంలోనే పేరు పొందిన వార్నర్ అండ్ బ్రదర్స్ కంపెనీ ఆధ్వర్యంలో డెలివరీ సెంటర్ ను ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
Jennifer Larson Comments
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జెన్నిఫర్ లార్సన్(Jennifer Larson). వ్యాపార, వాణిజ్య, ఐటీ, ఫార్మా , మీడియా తదితర రంగాలకు హైదరాబాద్ నగరం స్వర్గ ధామంగా మారిందని ప్రశంసలు కురిపించారు. ఇలాంటి నగరాన్ని తాను ఎన్నడూ చూడ లేదన్నారు.
ఇక్కడ ప్రజలు అత్యంత ప్రేమ పూర్వకంగా, స్నేహంగా ఉంటారని తాను మరిచి పోలేనని అన్నారు. మీడియా, వినోద పరంగా ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉన్న వార్నర్ అండ్ బ్రదర్స్ కంపెనీ ఇక్కడ డెలివరీ సెంటర్ ను ఏర్పాటు చేయడం తనకు ఆనందం కలిగించిందని చెప్పారు.
ఇదే సమయంలో ఈ కొత్తగా ఏర్పాటైన డెలివరీ సెంటర్ ద్వారా నైపుణ్యం కలిగిన కళాకారులు, మీడియా లో పేరు పొందిన వారికి అద్భుతమైన అవకాశాలు తలుపు తట్టే ఛాన్స్ ఉందన్నారు జెన్నిఫర్ లార్సన్.
Also Read : Minister KTR : వార్నర్ బ్రదర్స్ డెలివరీ సెంటర్