Vijay Sai Reddy : చంద్రబాబుపై విజయ సాయి సెటైర్
రాజమండ్రి జైలులో ఏసీ ఉండదు
Vijay Sai Reddy : వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై జైలులో ఉన్న బాబుకు అంత సీన్ లేదన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే జైలులోనే ఉండాలన్నారు. చట్టం అందరికీ ఒకేలాగా ఉంటుందన్న విషయం తెలుసుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు.
Vijay Sai Reddy Comments on Chandrababu
సీఎం అయినా మాజీ సీఎం అయినా లేదా ఇంకెవరైనా సరే చట్టం ముందు అందరూ సమానులేనన్న విషయం తెలుసు కోలేక పోవడం దారుణమన్నారు. జైలు నిబంధనలను అనుసరించి ఏసీ అంటూ ఏమీ ఉండదన్నారు. సామాన్య ఖైదీల లాగానే నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాన్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy).
ఫ్యాన్ ను తీసేసి ఏసీ కావాలంటే ఏర్పాటు చేసేందుకు రూల్స్ ఒప్పుకోవని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇంకా తాను సీఎం హోదాలో ఉన్నానని ఫీల్ అవుతున్నారని , ఆయన చని పోయేంత వరకు జైలులోనే ఉంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు. విచిత్రం ఏమిటంటే స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగడం లేదంటే ఎలా బాబూ అంటూ విజయ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
Also Read : Daggubati Purandeswari : జనసేనతోనే బీజేపీ పొత్తు
