Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.89 కోట్లు
స్వామిని దర్శించుకున్న 64,277 భక్తులు
Tirumala Rush : తిరుమల – శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు పుణ్య క్షేత్రానికి చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీనివాసుడిని 64 వేల 277 మంది దర్శించుకున్నారు.
Tirumala Rush with Devotees
శ్రీ వేంకటేశ్వర స్వామికి 24 వేల 340 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రతి రోజూ భక్తులు సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.89 కోట్లు ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
తిరుమల లోని 4 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారని తెలిపింది. ఇదిలా ఉండగా ఎలాంటి టోకెన్లు లేకుండా వేచి ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా దర్శనం కలిగే ఛాన్స్ ఉందని తెలిపారు ఏవో ఏవీ ధర్మారెడ్డి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున స్వామి వారి దర్శనం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చూశామని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
Also Read : Vijay Sai Reddy : చంద్రబాబుపై విజయ సాయి సెటైర్
