Namira Salim : స్వంత ఖర్చుతో అంతరిక్షంలోకి
పాకిస్తానీ వ్యోమ గామి నమీరా సలీం
Namira Salim : దాయాది పాకిస్తాన్ దేశం ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతోంది. కానీ ఆ దేశానికి చెందిన వ్యోమగామి నమీరా సలీం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. కారణం ఆమె తన స్వంత ఖర్చులతో అంతరిక్షంలోకి వెళ్లాలని నిర్ణయించు కోవడం.
Namira Salim Viral
ఎవరైనా ఒక మహిళ అంతరిక్షంలోకి వెళుతుందంటే ఆ దేశానికి ఎంతో గర్వ కారణంగా ఉంటుంది. చెప్పుకునేందుకే కాదు స్పాన్సర్ కోసమైనా కొన్ని కంపెనీలు వెంట పడతాయి. కానీ పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల్లో నమీరా సలీంకు(Namira Salim) ఎలాంటి హామీ ఇవ్వలేక పోయింది. దీంతో తనంతకు తానుగా అంతరిక్ష రంగంపై తనకున్న ప్రేమతో తానే స్వంతంగా ఖర్చు పెట్టుకుని వెళ్లేందుకు డిసైడ్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఎవరీ నమీరా సలీం అంటూ సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు నెటిజన్లు. ఆమె స్వస్థలం పాకిస్తాన్. కరాచీలో పుట్టారు. వ్యోమగామి మాత్రమే కాదు. ఆమె కళాకారిణి, గాయకురాలు కూడా. 2011లో మొనాకోకు పాకిస్తాన్ గౌరవ కాన్సుల్ గా పని చేశారు. ఉత్తర, దక్షిణ ధ్రువం చేరుకున్న తొలి పాకిస్తానీ జాతీయురాలు కావడం విశేషం.
అంతే కాదు వాణిజ్య స్పేస్ లైనర్ కోసం టికెట్ ను కొనుగోలు చేసిన తొలి 100 మంది ఔత్సాహిక అంతరిక్ష పర్యాటకలలో నమీరా సలీం ఒకరు. స్పేస్ ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేసింది.
Also Read : Buggana Rajendranath Reddy : దోచుకున్నోడికి జైలే గతి