Kurasala Kanna Babu : బాలయ్య మెంటల్ కేసు – కన్నబాబు
ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్
Kurasala Kanna Babu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్న బాబు(Kurasala Kanna Babu) సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీ స్కిల్ స్కాంలో అడ్డంగా బుక్కైన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఇక ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ పై నిప్పులు చెరిగారు కురసాల కన్న బాబు.
Kurasala Kanna Babu Comments on Balakrishna
ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో తనకే తెలియదన్నారు. ఇప్పటికే నాలుగు ఆస్పత్రులలో బాలయ్య చూపించుకున్నారని , ఆల్ రెడీ బాలయ్యకు మెంటల్ (పిచ్చి) ఉందంటూ సర్టిఫికెట్ కూడా ఉందన్నారు. ఇదిలా ఉండగా దేశంలో మెంటల్ సర్టిఫికెట్ ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఒక్క బాలకృష్ణనేనని స్పష్టం చేశారు.
నందమూరి బాలయ్య పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఏ సమయంలో ఎలా వ్యవహరిస్తాడో తెలియకుండా ఉందని, ఈ విషయంలో స్పీకర్ కలుగ చేసుకోవాలని సూచించారు మంత్రి కురసాల కన్న బాబు.
Also Read : Kalava Srinivasulu : చంద్రబాబు విడుదలయ్యే దాకా దీక్ష