WFI Chief Comment : మోదీజీ దేశం సిగ్గు పడుతోంది
బ్రిజ్ భూషణ్ వేధింపులు నిజం
WFI Chief Comment : మహిళా రెజ్లర్లను నానా తిట్లు తిట్టారు. వాళ్లు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు అని చెప్పేందుకు ప్రయత్నం చేశారు. దేశ వ్యాప్తంగా మహిళా మల్ల యోధులు కన్నీటి పర్యంతం అయ్యారు. కానీ అవన్నీ ఫేక్ కన్నీళ్లు అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి రోజూ నిత్యం భారత దేశం అని స్మరించే హిందూ భక్తులు, సంస్థలు ఇప్పుడు ఏం జవాబు చెబుతాయో వేచి చూడాలి. భారత రెజ్లర్ల సమాఖ్యకు తానే సుప్రీం అంటూ వచ్చాడు. అన్నీ తానై వ్యవహరించాడు ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh). తాను సచ్చీలుడినని, తనకు ఏ పాపం తెలియదంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నం చేశాడు. అతడి మీద కేసు పెట్టేందుకు పోలీసులు భయపడ్డారంటే ఆయన వెనుక ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. పోనీ ఈ ఎంపీ ఎవరో కాదు భారతీయ జనతా పార్టీకి కావాల్సిన నాయకుడు. నిత్యం వేదాలు, ఉపనిశత్తులు, సంస్కృతి, భారతీయత , ఆలయాల విశిష్టత గురించి పదే పదే ప్రస్తావించే వారికి ఇష్టమైన వ్యక్తి.
WFI Chief Comment Viral
విచిత్రం ఏమిటంటే మనోడి మీద కేసు నమోదు చేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశిస్తే కానీ పోలీసులు కదల లేదు. తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కారు తొలిసారిగా మహిళా మల్ల యోధులు. ఇదంతా రాజకీయం అని రుద్దే ప్రయత్నం చేశారు. కానీ తమకు ఎవరి సపోర్ట్ అక్కర్లేదని, తాము దేశం కోసం ఆడామని, ఎన్నో పతకాలు తీసుకు వచ్చిన తమను ఇలా అవమానిస్తారా అంటూ నిలదీశారు. ఆపై కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ తరుణంలో కమిటీ వేసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కేసు ముందుకు సాగకుండా ప్రయత్నం చేస్తూ వచ్చాడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(Brij Bhushan Sharan Singh). ఎందుకంటే తను రాబోయే ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించనున్నాడు. కనీసం 20 లోక్ సభ నియోజకవర్గాల గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే సత్తా ఉన్నోడు. అందుకనే ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జడుసుకుంటున్నారు. చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు.
ఈ తరుణంలో ఇవాళ సంచలన రిపోర్టు కోర్టుకు సమర్పించారు ఢిల్లీ పోలీసులు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిమ్మ తిరిగేలా వాస్తవాలు బయట పడ్డాయి. తనకు వచ్చిన ఏ ఛాన్స్ ను వదలలేదు మనోడు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ఉంచారు. కేంద్ర సర్కార్ నియమించిన కమిటీ ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పడం కొస మెరుపు. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు తజకిస్తాన్ కు వెళ్లిన మహిళా రెజ్లర్లలో ఒకరిని కౌగిలించుకున్నాడని ఆరోపించారు. ఓ రెజ్లర్ చొక్కాను అనుమతి లేకుండా పైకి లేపాడు. ఉద్దేశ పూర్వకంగానే ఇది చేశాడంటూ స్పష్టం చేసింది . మొత్తంగా మహిళా బిల్లు ఆమోదం పొందిన ఈ సమయంలో . బీజేపీ ఎంపీకి వ్యతిరేకంగా నివేదిక రావడం
ఒక రకంగా మోదీకి, బీజేపీకి మింగుడు పడని అంశం అని చెప్పక తప్పదు. మరి చర్యలు తీసుకుంటారా లేక చూస్తూ వదిలేస్తారా వేచి చూడాలి.
Also Read : Prakash Raj : ఖిలాడీ నెంబర్ వన్