Devineni Uma : ఆధారాలు లేకుండానే బాబు అరెస్ట్
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు
Devineni Uma : ఎన్టీఆర్ జిల్లా – ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు. ఆయన మీడియాతో మాట్లాడారు. కావాలని కక్ష సాధింపు ధోరణితో అదుపులోకి తీసుకున్నారని, వేధించడం మంచి పద్దతి కాదన్నారు.
Devineni Uma Comments on Chandrababu Arrest
ఎఫ్ఐఆర్ లో పేరు లేక పోయినా 2 వేల మంది పోలీసులను పెట్టి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి తీసుకు వచ్చారంటూ ధ్వజమెత్తారు ఉమా మహేశ్వర్ రావు(Devineni Uma). గత కొన్ని రోజుల నుంచి విచారిస్తున్నారు. కానీ ఏ ఒక్క ఆధారాన్ని కనుక్కోలేక పోయారని పేర్కొన్నారు.
ఏపీ సీఐడీ ఆఫీసర్లను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదన్నారు మాజీ మంత్రి. రెండు రోజుల పాటు విచారించినా ఏమీ తేల్చలేక చేతులెత్తేశారంటూ ధ్వజమెత్తారు దేవినేని ఉమా మహేశ్వర్ రావు.
కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప మీద కేసు కూడా ఇలాగే నమోదు చేశారని, దీనిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పిందన్నారు. ఇది తప్పు అంటూ స్పష్టం చేసిందన్నారు మాజీ మంత్రి. అరెస్ట్ చేయకుండా రిమాండ్ కొట్టి వేసిందని స్పష్టం చేశారు. కేసుకు సంబంధించి 18 రోజులు పట్టిందన్నారు.
Also Read : CV Anand : గణేశ్ నిమజ్జనం భద్రత కట్టుదిట్టం – సీపీ