Nara Bhuvaneshwari : ఎవ‌రేమ‌న్నా ప‌ట్టించుకోను

నారా భువ‌నేశ్వ‌రి కామెంట్

Nara Bhuvaneshwari : రాజ‌మండ్రి – తన‌ను, త‌న కుటుంబాన్ని ఎవ‌రు ఎలా ర‌కాలుగా మాట్లాడినా తాను ఏమీ అనుకోన‌ని స్ప‌ష్టం చేశారు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు భార్య నారా భువ‌నేశ్వ‌రి. బుధ‌వారం రాజ‌మండ్రిలోని ప్ర‌ముఖ లూథ‌ర‌న్ చ‌ర్చిలో త‌న కోడలు, హెరిటేజ్ ఎండీ నారా బ్రాహ్మ‌ణితో క‌లిసి ప్రార్థ‌న‌లు చేశారు.

Nara Bhuvaneshwari Comment

అనంత‌రం ఆమె టీడీపీ శ్రేణుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. నిత్యం గుట్కాలు తినే మాజీ మంత్రి కొడాలి నాని, సైకో జ‌గ‌న్ , పేర్ని నాని, గుడివాడ అమ‌ర్నాథ్, అంబ‌టి రాంబాబు లాంటి నోటికి వ‌చ్చిన‌ట్లు వాగుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌న భ‌ర్త ఏ త‌ప్పు చేయలేద‌ని , త‌న‌కు ఆ న‌మ్మ‌కం ఉంద‌న్నారు నారా భువ‌నేశ్వ‌రి(Nara Bhuvaneshwari). మిమ్మ‌ల్ని న‌డిపిస్తూ నానా అమ్మ‌నా బూతులు తిట్టిస్తున్న ఆ సైకో జ‌గ‌న్ రెడ్డికి ఒక‌టే చెబుతున్నా..మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని హెచ్చ‌రించారు.

పైన దేవుడు ఉన్నాడ‌ని, త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి చూస్తున్నాడ‌ని స్ప‌ష్టం చేశారు భువ‌నేశ్వ‌రి.
ఈ ప్ర‌పంచానికి త‌ల్లి లాంటిది స్త్రీ. ఆ విష‌యాన్ని మ‌రిచి పోయి వైసీపీ నేత‌లు మాట్లాడుతున్నార‌ని , ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

Also Read : Kotha Manohar Reddy : టికెట్లు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!