C Ashwini Dutt : చంద్ర‌బాబు యుగ పురుషుడు

సినీ నిర్మాత అశ్వినిద‌త్

C Ashwini Dutt : హైద‌రాబాద్ – ప్ర‌ముఖ సినీ నిర్మాత సి. అశ్వినిద‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నారా చంద్ర‌బాబు నాయుడు ను ఆకాశానికి ఎత్తేశారు. ఆయ‌న‌ను యుగ పురుషుడంటూ కితాబు ఇచ్చారు. గొప్ప నాయ‌కుడు, అత్యున్న‌త‌మైన మ‌నిషిని అరెస్ట్ చేసి జైల్లో పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు.

C Ashwini Dutt Comments Viral

తీవ్ర స్థాయిలో వైసీపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. చంద్ర‌బాబు నాయుడు గొప్ప చ‌రిత్ర‌కారుడు. ఎవ‌రైనా ఊహించారా ఆయ‌న‌ను అరెస్ట్ చేస్తార‌ని అని ప్ర‌శ్నించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 175 సీట్ల‌కు గాను 160 సీట్లు గెల‌వ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన పార్టీ క‌లిసి పోటీ చేస్తాయ‌ని , చంద్ర‌సేన దుమ్ము రేప‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఈ రెండు క‌లిసి వైసీపీని నామ రూపాలు లేకుండా చేస్తాయ‌ని పేర్కొన్నారు సి. అశ్విని ద‌త్(C Ashwini Dutt). రాష్ట్రంలో దారుణ‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని, ప్ర‌జ‌లు భ‌రించ లేకుండా ఉన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా రంగానికి సంబంధించి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర రావుతో పాటు సి. అశ్విని ద‌త్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు వేరే ఎవ‌రూ ముందుకు రాలేదు.

Also Read : Nara Bhuvaneshwari : ఎవ‌రేమ‌న్నా ప‌ట్టించుకోను

Leave A Reply

Your Email Id will not be published!