Rahul Dravid : అశ్విన్ ఆడతాడో లేదో చెప్పలేం
భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
Rahul Dravid : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఐసీసీ వరల్డ్ కప్ జరుగుతోంది. ఇప్పటికే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీమిండియాను ఎంపిక చేసింది. దీంతో జట్టుకు సంబంధించి అక్షర్ పటేల్ గాయపడ్డాడు.
Rahul Dravid Comment Viral
అతడి స్థానంలో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను తీసుకుంటారా అన్న ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు రాహుల్ ద్రవిడ్(Rahul Dravid). తీసుకోవాలా వద్దా అన్న దానిపై ఇప్పుడే తాను ఏమీ చెప్పలేనంటూ పేర్కొన్నాడు.
ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ , శ్రేయాస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు చెప్పారు. వారం రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటారని తాను భావిస్తున్నట్లు చెప్పాడు ద్రవిడ్.
మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని అతడు కూడా త్వరలోనే వరల్డ్ కప్ టీమ్ లోకి రానున్నాడని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తుది జట్టును ఖరారు చేయాల్సి ఉంది. గురువారం ఆఖరి రోజు. లేక పోతే ఇబ్బంది అవుతుందని పేర్కొన్నాడు.
Also Read : Virat Kohli : పాకిస్తాన్ టీమ్ కు కోహ్లీ వెల్ కమ్