CM KCR : తెలంగాణ – ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని అంగన్ వాడీలలో పని చేస్తున్న టీచర్లకు తీపి కబురు తెలిపారు. త్వరలో ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో అంగన్ వాడీలను చేర్చాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు విధి విధానాలను తయారు చేయాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు కేసీఆర్.
CM KCR Govt Starts New Policy
త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో వీరిని చేర్చనున్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ వ్యాప్తంగా పని చేస్తున్న 70 వేల మంది అంగన్ వాడీ ఉద్యోగులకు లాభం చేకూరుతుందని స్పష్టం చేశారు రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు.
ఇందులో భాగంగా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. అంగన్ వాడీలు గత కొంత కాలంగా చేస్తున్న డిమాండ్ లను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు మంత్రి.
వాటి పట్ల సానుకూలంగా స్పందిస్తామని తెలిపారు. అంగన్ వాడీలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు తన్నీరు హరీశ్ రావు.
Also Read : Minister KTR : అమరజ్యోతి డాక్యుమెంటరీ ఆవిష్కరణ