Muttaiah Muralitharan : హైదరాబాద్ నగరం అద్భుతం
మాజీ క్రికెటర్ మురళీధరన్
Muttaiah Muralitharan : హైదరాబాద్ – శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. అన్ని రంగాలలో అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఇండియాలో తాను చాలా ప్రాంతాలు తిరిగానని , కానీ భాగ్యనగరం తనకు మరింత సంతోషం కలిగిస్తోందని తెలిపారు.
Muttaiah Muralitharan Comment
తన పేరు మీద తీసిన బయోపిక్ 800 సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్ , ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీధరన్ హైదరాబాద్ తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు.
తనకు హైదరాబాద్ లో తయారు చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పారు ముత్తయ్య మురళీధరన్. తాను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అంతగా డెవలప్ కాలేదన్నారు. కానీ ఇప్పుడు చూశాక ఇది హైదరాబాదేనా అన్న అనుమానం తనకు కలిగిందన్నారు.
మొత్తంగా ఇప్పుడు చూస్తే ఇండియాలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతన్న సిటీగా మారడం అభినందనీయమని పేర్కొన్నారు మురళీధరన్.
Also Read : Bandi Sanjay : కేసీఆర్ ఆచూకీ తెలిస్తే చెప్పండి
