Sunil Gavaskar : బీసీసీఐ నిర్వాకం గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం

కార్య‌ద‌ర్శి జే షా తీరుపై షాకింగ్ కామెంట్స్

Sunil Gavaskar : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పై నిప్పులు చెరిగారు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వ‌ర్యంలో బీసీసీఐ నిర్వ‌హిస్తున్న ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు గ‌వాస్క‌ర్ .

Sunil Gavaskar Comments Viral

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ను నిర్వ‌హించ‌డంలో పూర్తిగా విఫ‌లమైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను భార‌తీయుడిన‌ని చెప్పు కునేందుకు చాలా సిగ్గు ప‌డుతున్నాన‌ని పేర్కొన్నారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అత్యంత చెత్త ప్ర‌పంచ కప్ అని మండిప‌డ్డారు గ‌వాస్క‌ర్.

స్టేడియాల‌లో ఎవ‌రూ లేరు. క‌నీసం స్కోర్ బోర్డులు కూడా ఏర్పాటు చేయ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు స‌న్నీ. బీసీసీఐ నుంచి తాను ఇలాంటి నిర్వ‌హ‌ణ ఉంటుంద‌ని ఏనాడూ అనుకోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంత నీచ‌మైన మేనేజ్ మెంట‌ను తాను ఊహించ లేద‌ని పేర్కొన్నారు.

ప్ర‌త్యేకించి బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షాపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఒక మాజీ క్రికెట‌ర్ గా తాను తీవ్ర ఆవేద‌న చెందుతున్న‌ట్లు వాపోయారు సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్.

Also Read : Cheekoti Praveen : బీజేపీ గూటికి చీకోటి

Leave A Reply

Your Email Id will not be published!