IND vs PAK ICC World Cup : భారత్ భళా పాక్ విలవిల
7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ
IND vs PAK ICC World Cup : అహ్మదాబాద్ – ఐసీసీ(ICC) వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరిగిన కీలక పోరులో దాయాది పాకిస్తాన్ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టును భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. దీంతో తక్కువ స్కోర్ కే పరిమితం చేశారు.
IND vs PAK ICC World Cup Updates
పాకిస్తాన్ స్కిప్పర్ బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీ చేస్తే రిజ్వాన్ అతడికి తోడుగా నిలిచాడు. ఆ ఇద్దరు తప్ప మిగతా క్రికెటర్లు ఎవరూ ఆశించిన మేర రాణించ లేక పోయారు. రోహిత్ శర్మ పదే పదే బౌలర్లను మార్చాడు. హాఫ్ సెంచరీతో మంచి ఊపు మీదున్న స్కిప్పర్ బాబర్ ఆజమ్ ను కళ్లు చెదిరే బంతికి బోల్తా కొట్టించాడు హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహమ్మద్ సిరాజ్.
సరిగ్గా 50 వద్ద పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత బుమ్రా, కుల్దీప్ యాదవ్ , హార్దిక్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. పరుగులు చేయలేక పాకిస్తాన్ చేతులెత్తేసింది. 42.5 ఓవర్లకే దాయాది జట్టు191 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, గిల్ , కోహ్లీ కలిసి 156 రన్స్ చేశారు. అనంతరం అయ్యర్ అదుర్స్ అనిపించాడు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 53 రన్స్ చేశాడు.
Also Read : Nara Lokesh : బాబు అరెస్ట్ పై వినూత్న నిరసన