Ketham Reddy Vinod Reddy : నాదెండ్ల టీడీపీ కోవ‌ర్టు

వైసీపీ నేత కేతం రెడ్డి

Ketham Reddy Vinod Reddy : నెల్లూరు జిల్లా – వైసీపీ నాయ‌కుడు కేతం రెడ్డి వినోద్ రెడ్డి(Ketham Reddy Vinod Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జ‌న‌సేన పార్టీని వీడి ఇటీవ‌లే జ‌గ‌న్ రెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జ‌న‌సేన పార్టీ ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయ‌డం లేద‌న్నారు. కేవ‌లం తెలుగుదేశం పార్టీ బ‌లోపేతం కోసం ప‌ని చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Ketham Reddy Vinod Reddy Comments

ఒక ర‌కంగా చెప్పాలంటే నాదెండ్ల మ‌నోహ‌ర్ జ‌న‌సేన పార్టీని అత్యాచారం చేస్తున్నాడ‌ని, ఇక పార్టీ చీఫ్ గా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయ‌న‌కే తెలియ‌డం లేద‌న్నారు. ఇక పార్టీ ఎలా ముందుకు వెళుతుంద‌ని ప్ర‌శ్నించారు కేతం రెడ్డి వినోద్ రెడ్డి.

నాదెండ్ల మ‌నోహ‌ర్ నారా చంద్ర‌బాబు నాయుడు మ‌నిషి అని, ఆయ‌న ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీకి కోవ‌ర్టుగా ప‌ని చేస్తున్నాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప‌వ‌న్ కళ్యాణ్, మ‌నోహ‌ర్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా , ఎన్ని వ్యూహాలు ర‌చించినా రాబోయే ఎన్నిక‌ల్లో గెలిచేది వైసీపీ పార్టీనేన‌ని జోష్యం చెప్పారు కేతం రెడ్డి.

జ‌న‌సేన పార్టీని నాదెండ్ల మ‌నోహర్ ప‌నిగ‌ట్టుకుని నాశ‌నం చేస్తున్నార‌ని ఆరోపించారు. వైసీపీలో చేరినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. తాను డ‌బ్బుల కోసం, ఏదో ప‌ద‌వి వ‌స్తుంద‌ని , ద‌క్కుతుంద‌ని ఆశ‌తో చేర‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Kuruva Vijay Kumar : రూ. 600 కోట్ల‌కు 65 సీట్ల బేరం

Leave A Reply

Your Email Id will not be published!