Congress List : ఖ‌రారు కాని కాంగ్రెస్ లిస్టు

క‌స‌రత్తు చేస్తున్న స్క్రీనింగ్ క‌మిటీ

Congress List : న్యూఢిల్లీ – అంద‌రూ అతిర‌థ మ‌హార‌థులే. కానీ ఇప్ప‌టి వ‌రకు తెలంగాణ‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డంలో ఇంకా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. అదిగో పులి ఇదిగో ఆవు అన్న చందంగా రోజు రోజుకు లీకులు ఇస్తూ మ‌రింత ఉత్కంఠ రేపుతున్నారు.

Congress List not Released for second

ఇక అధికారంలో ఉన్న గులాబీ పార్టీ బాస్ , సీఎం కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముంద‌స్తుగానే జాబితాను ఖ‌రారు చేశారు. 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఇందులో ఏడుగురికి షాక్ ఇచ్చారు. వారి ప‌నితీరు, వ్య‌క్తిగ‌త ప్ర‌వ‌ర్త‌న‌, ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప‌క్క‌న పెట్టిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక బీ ఫార‌మ్ లు కూడా ఇచ్చేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప‌వ‌ర్ లోకి రావాల‌ని అనుకుంటోంది. ప‌లు చోట్ల ప‌ని చేసిన వాళ్ల‌కు కాద‌ని ఇత‌ర పార్టీల నుంచి జంప్ అయిన వాళ్ల‌కు సీట్లు ఖ‌రారు చేసింది. దీంతో పార్టీలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేద‌ని తేలి పోయింది. ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ కొల్లాపూర్, నాగ‌ర్ క‌ర్నూల్. గ‌త కొంత కాలం నుంచి నాగం జ‌నార్ద న్ రెడ్డి, జ‌గ‌దీశ్వ‌ర్ రావు పార్టీని కాపాడుకుంటూ వ‌చ్చారు.

చివ‌ర‌కు ఇక్క‌డ బీఆర్ఎస్ నుంచి పార్టీ తీర్థం పుచ్చుకున్న జూప‌ల్లి కృష్ణా రావు, రాజేష్ రెడ్డికి టికెట్ల‌ను కేటాయించింది పార్టీ. ఇది ప‌క్క‌న పెడితే రెండో జాబితా ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. తొలి జాబితాలో 55 సీట్ల‌ను ప్ర‌క‌టించింది. ఇంకా 64 సీట్ల‌ను ఖ‌రారు చేయాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీలోకి వ‌స్తున్న నేత‌ల సంఖ్య పెరుగుతోంది. దీంతో లిస్టును ప్ర‌క‌టించ‌కుండా నాన్చుతోంది.

Also Read : Chandra Babu Case : బాబు బెయిల్ పిటిష‌న్ వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!