Chandra Babu Naidu Comment : ‘చంద్రుడి’లో చావు భ‌యం

బోనులో చిక్కిన బాబు

Chandra Babu Naidu Comment : రాజ‌కీయాల‌లో ప‌ద‌వుల‌కు ఉన్నంత ప‌వ‌ర్ ఇంకే దానికీ ఉండ‌దు. అందుక‌నే నేత‌లు వాటి కోసం పాకులాడ‌తారు. ఇండియ‌న్ పాలిటిక్స్ లో ఒక‌ప్పుడు చ‌క్రం తిప్పిన ఘ‌న‌త తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడిది(Chandrababu Naidu). కానీ సీన్ మారింది. ప‌వ‌ర్ పోయింది. ఇప్పుడు ఇటు తెలంగాణ‌లో అటు ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప్ర‌భ మ‌స‌క బారుతోంది. వ్య‌వ‌స్థ‌ల‌ను మ్యానేజ్ చేస్తూ వ‌చ్చార‌న్న ఆరోప‌ణ‌లు లేక పోలేదు. ఇది ప‌క్క‌న పెడితే త‌న జీవిత కాలంలో 40 ఏళ్ల పాటు రాజ‌కీయ రంగంలో కొన‌సాగుతూ వ‌చ్చారు. త‌న ప్ర‌స్థానంలో ఎంద‌రినో ఎదుర్కొన్నారు. మ‌రికొంద‌రిని మ‌ట్టి క‌రిపించారు. త‌న‌కు ఎదురే లేకుండా చేసుకుంటూ వ‌చ్చారు. దీని వెనుక బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంతో పాటు మీడియా కూడా వెన్ను ద‌న్నుగా నిలిచిందన్న‌ది వాస్త‌వం.

Chandra Babu Naidu Comment Viral

ఎప్పుడైతే ఏపీ రాష్ట్రంలో వైసీపీ స‌ర్కార్ కొలువు తీరిందో ఆనాటి నుంచి ఆధిప‌త్యం చెలాయిస్తూ వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడుకు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఎదుటి వాళ్ల‌ను ఏడిపించినంత ప‌ని చేసిన నాయ‌కుడు, ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా కొట్టించ‌డ‌మే కాదు ప్ర‌తిప‌క్షాల‌కు చుక్క‌లు చూపించాడు. కానీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌న భార్య భువ‌నేశ్వ‌రి దేవిని అన‌రాని మాట‌లు అన్నారంటూ వాపోయాడు. ఆపై మీడియా సాక్షిగా బావురు మ‌న్నారు చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu).

వ‌య‌సు రీత్యా అలా చేశార‌ని అనుకున్నారు. వైసీపీ బాబుదంతా న‌ట‌న త‌ప్ప నిజం కాద‌ని ఆనాడే ఎద్దేవా చేసింది. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల ర‌ణ క్షేత్రంలోకి దూకుతున్నానంటూ ప్ర‌క‌టించారు. ఆపై ప్ర‌త్య‌క్షంగా ప్ర‌చారం చేప‌ట్టారు. త‌న‌తో పాటు త‌న త‌న‌యుడు నారా లోకేష్ తో క‌లిసి.

కానీ చంద్ర‌బాబు అనుకున్న‌దంతా రివ‌ర్స్ అయ్యింది. ఎత్తుకు పై ఎత్తు వేయ‌డంలో త‌న‌కంటే రెండాకులు ఎక్కువ‌గా చ‌దివాడు వైసీపీ చీఫ్‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. కేంద్రంలో మోదీ, షా సపోర్ట్ తీసుకున్నాడు. ఊహించ‌ని రీతిలో చెక్ పెట్టాడు. ఆపై పులిని, సింహాన్ని అంటూ త‌న‌ను తాను ఎక్కువ‌గా ఊహించుకున్న చంద్ర‌బాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఏపీ సీఐడీ అడ్డంగా ఏపీ స్కిల్ స్కాంతో పాటు మ‌రికొన్ని కేసుల్లో ఇరికించింది. చివ‌ర‌కు రాజ‌మండ్రి జైలు ఊచ‌లు లెక్క పెట్టే ప‌నిలో ఉన్నారు చంద్ర‌బాబు.

సుప్రీం నుంచి లాయ‌ర్లు వ‌చ్చినా, త‌ను ఎన్ని పిటిష‌న్లు దాఖ‌లు చేసినా ఇప్ప‌ట్లో బెయిల్ వ‌చ్చే ఛాన్స్ క‌నిపించ‌డం లేదు. తాజాగా అంద‌రినీ విస్తు పోయేలా త‌న‌ను చంపేందుకు కుట్ర ప‌న్నుతున్నారంటూ చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా లేఖ రాశారు. విచిత్రం ఏమిటంటే నిన్న‌టి దాకా బీరాలు ప‌లికిన స‌ద‌రు నేత‌కు జ‌గ‌న్ రూపంలో భ‌యం ప‌ట్టుకుందా లేక చావు రూపంలో ఆందోళ‌న నెల‌కొందా అనేది టీడీపీ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నాయి. ఏది ఏమైనా చంద్ర‌బాబు నోటి వెంట ఇలాంటి కామెంట్స్ రావ‌డ‌మే ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మానదు.

Also Read : Chandra Babu Naidu : జైల్లో నాకు ప్రాణ‌హాని ఉంది

Leave A Reply

Your Email Id will not be published!