Mohammad Azharuddin : ముంద‌స్తు బెయిల్ కోసం అజ్జూ

హెచ్ సీ ఏ రూపాయ‌ల నిధుల కేసు

Mohammad Azharuddin : హైద‌రాబాద్ – భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , హెచ్ సీ ఏ మాజీ చీఫ్ మ‌హ‌మ్మ‌ద్ అజాహ‌రుద్దీన్ కు బిగ్ షాక్ త‌గిలింది. హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ లో కోట్ల రూపాయ‌ల నిధులు గోల్ మాల్ అయ్యాయంటూ అజ్జూపై కేసు న‌మోదైంది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయాల‌ని పిటిష‌న్ లో కోరారు.

Mohammad Azharuddin Bail Status

టెండ‌ర్ల పేరుతో థ‌ర్డ్ పార్టీకి నిధులు క‌ట్ట బెట్టారంటూ అజాహ‌రుద్దీన్(Mohammad Azharuddin) పై కేసు న‌మోదైంది. ఇప్ప‌టి వ‌ర‌కు అజ్జూపై నాలుగు కేసులు పెట్టింది జ‌స్టిస్ లావ్ నాగేశ్వ‌ర్ రావు క‌మిటీ. 202 నుండి 2023 వ‌ర‌కు హెచ్ సీ ఏలో కోట్ల రూపాయ‌ల నిధులు స్వాహా చేశారంటూ ఫోరెన్సిక్ నివేదిక వెల్ల‌డించింది.

ఇందులో భాగంగా గ‌త ఆగ‌స్టు 10న హెచ్ సీ ఏ నిధుల‌పై ఆడిట్ నిర్వ‌హించింది లావు నాగేశ్వ‌ర్ రావు క‌మిటీ. క్రికెట్ బాల్స్ కొనుగోలులో భారీగా అక్ర‌మాలు చోటు చేసుకున్న‌ట్లు గుర్తించింది. ఒక్కో బాల్ ధ‌ర రూ. 392 ఉండ‌గా రూ. 1400 రూపాయ‌ల‌కు వ‌ర్క్ ఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్లు తేలింది. దాదాపు దీని వ‌ల్ల సంస్థ‌కు రూ. 57 ల‌క్ష‌ల న‌ష్టం వాటిల్లిన‌ట్లు గుర్తించింది.

అంతే కాకుండా బ‌కెట్ చైర్స్ కొనుగోలు పేరుతో జ‌రిగిన గోల్ మాల్ లో రూ. 43 ల‌క్ష‌లు న‌ష్టం వాటిల్లిన‌ట్లు తేలింది. ఫైర్ ఫైటింగ్ ప‌రిక‌రాల పేరుతో రూ. 150 కోట్లు, జిమ్ ప‌రిక‌రాల పేరుతో రూ. 1.53 కోట్లు న‌ష్టం వ‌చ్చిన‌ట్లు పేర్కొంది క‌మిటీ. అజారుద్దీన్ పై ఉప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. ఆనాటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ కేసుకు సంబంధించి త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు అజాహ‌రుద్దీన్.

Also Read : Congress 2nd List : 45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్

Leave A Reply

Your Email Id will not be published!