Eatala Rajender : నా వ‌ద్ద ఏదీ దొర‌క‌దు – ఈట‌ల

మాజీ మంత్రి వాహ‌నం చెకింగ్

Eatala Rajender : హైద‌రాబాద్ – మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను పేదోడిన‌ని, త‌న జీవితం తెరిచిన పుస్త‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తాను క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాన‌ని, రాజ‌కీయాల‌ను అడ్డం పెట్టుకుని సంపాదించే నైజం కాద‌ని పేర్కొన్నారు.

Eatala Rajender Comments Viral

రాష్ట్రంలో ఎన్నిక‌ల న‌గారా మోగింది. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ పోలీసులు త‌నిఖీలు చేస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బ‌య‌లు దేరిన ఈట‌ల రాజేంద‌ర్(Eatala Rajender) కు బిగ్ షాక్ త‌గిలింది. కోడ్ లో భాగంగా ఖాకీలు ఈట‌ల వాహ‌నాన్ని ఆపారు. క్షుణ్ణంగా త‌నిఖీలు చేప‌ట్టారు.

ఎక్క‌డా ఒక్క పైసా దొర‌క‌లేదు. తాను కూడా చ‌ట్టాన్ని గౌర‌వించే వ్య‌క్తిన‌ని, త‌న‌కు భార‌త రాజ్యాంగం ప‌ట్ల న‌మ్మ‌కం ఉంద‌ని అన్నారు ఈ సంద‌ర్బంగా ఈట‌ల రాజేంద‌ర్. చెక్ పోస్ట్ వ‌ద్ద య‌ధావిధిగా త‌న వాహ‌నాన్ని చెకింగ్ చేశార‌ని తాను స‌హ‌క‌రించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

త‌న వ‌ద్ద ఖ‌ర్చుకు కూడా పైస‌లు ఉండ‌వ‌ని అన్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఉన్న కేసీఆర్ వ‌ద్ద డ‌బ్బులు ఉంటాయ‌ని, త‌న వ‌ద్ద ఎలా ఉంటాయ‌ని ప్ర‌శ్నించారు ఈట‌ల రాజేంద‌ర్. ఎంత‌గా ప్ర‌య‌త్నం చేసినా, త‌న‌పై ఎంతగా బుర‌ద చ‌ల్లినా ప్ర‌జ‌లు త‌న‌ను ఆశీర్వ‌దించడం ఖాయ‌మ‌న్నారు.

కాగా ఈసారి ఎన్నిక‌ల్లో రెండు చోట్ల బ‌రిలో ఉండ‌నున్నారు ఈట‌ల రాజేంద‌ర్. కేసీఆర్ పోటీ చేసే గ‌జ్వేల్ బ‌రిలో పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Also Read : Meruga Nagarjuna : బాబుకు బుద్ది చెప్ప‌డం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!