Akkineni Nagarjuna : కేసీఆర్ సర్కార్ కు నాగ్ కితాబు
హైదరాబాద్ ఎంతో అభివృద్ది చెందింది
Akkineni Nagarjuna : హైదరాబాద్ – ప్రముఖ నటుడు, బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఈనెలలో శాసన సభ ఎన్నికలు జరగున్నాయి. దీంతో సినీ రంగానికి చెందిన కొందరు హైదరాబాద్ నగరం గురించి ఎవరూ అడగ కుండానే తమ అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు చంద్రబాబు నాయుడు జపం చేస్తుంటే నాగార్జున ముందు నుంచీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటూ వచ్చారు.
Akkineni Nagarjuna Comments Viral
ఆయనకు చెందిన కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూల్చేసింది. దీంతో ఏమైందో ఏమో కానీ నాగార్జున స్వరంలో మార్పు చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో దాడులకు దిగుతారమేమోనని భయపడిన వారంతా ఇప్పుడు కాలరెగరేసుకుని తిరుగుతున్నారు.
ఇంకో వైపు బండ్ల గణేష్ అయితే చంద్రబాబు నాయుడిని దేవుడు అంటూ పొగుడుతున్నాడు. ఇక హీరోయిన్లను మరింత సెక్సీగా చూపించే పేరున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అయితే చంద్రబాబు బయటకు రాక పోతే లోకమంతా చీకటే అన్నట్టు కామెంట్ చేశాడు.
తాజాగా నాగార్జున హైదరాబాద్ గతంలో కంటే ఇప్పుడే సూపర్ గా డెవలప్ అయ్యిందని, దిగ్గజ కంపెనీలన్నీ ఇటు వైపు చూస్తున్నాయంటూ కితాబు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మరాయి.
Also Read : AP CID Chief AAG : ఏపీ సీఐడీ..ఏఏజీపై విచారణ వాయిదా