CJI Shock Comment : సుప్రీం ఆగ్రహం దిగొచ్చిన కేంద్రం
ఆర్టీఐ డెడ్ లెటర్ కానుందా
CJI Shock Comment : అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ రాచరిక పాలన సాగించాలని చూస్తున్న కేంద్రంలో కొలువు తీరిన ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. కేవలం ఒకే ఒక్కడు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. తను కొలువు తీరాక సంచలన తీర్పులు వెలువరిస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. పూర్తిగా పారదర్శకత ఉండేలా చర్యలు చేపట్టారు. ఆపై ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా సమాచారం పొందు పర్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవాళ న్యాయ వ్యవస్థను సామాన్యుడి ముంగిటకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు ఆయనను అభినందించక తప్పదు. చివరకు చీఫ్ ఎన్నికల కమిషనర్ల ఎంపిక విషయంలో తను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
CJI Shock Comment Viral
అంతే కాదు మణిపూర్ కాలి పోతుంటే కేంద్రం నిద్ర బోతోందా, ప్రధానమంత్రి ఏం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. కేంద్రానికి చేత కాక పోతే సుప్రీంకోర్టు రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీజేఐలు ఈ మధ్య కాలంలో లేరు. ప్రధానంగా దేశాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుని ఏకపక్ష పాలన సాగిస్తున్న నరేంద్ర మోదీకి సీజేఐ చంద్రచూడ్ నచ్చడం లేదు. అయినా తప్పడం లేదు. ఆయనను తప్పించాలంటే నానా తంటాలు పడాల్సి ఉంటుంది. అభిశంషన తీర్మానం పెట్టాల్సి ఉంటుంది. ఇందుకు రాజ్యసభ, లోక్ సభ తో పాటు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను నియమించడంలో కేంద్రం ప్రదర్శించిన అత్యుత్సాహాన్ని ఆయన తప్పు పట్టారు. ఇది కూడా ఓ సెన్సేషన్ సృష్టించింది.
ఇదే సమయంలో భారత దేశంలో అత్యున్నతంగా భావించే సమాచార హక్కు చట్టం అమలు విషయంలో సమాచార కమిషనర్లను నియమించక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆపై కేంద్రాన్ని, మోదీని నిలదీశారు. చివరకు సంచలన వ్యాఖ్యలు చేశారు సీజేఐ చంద్రచూడ్ , జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం. ఇప్పటి వరకు ఎందుకు దేశ వ్యాప్తంగా ఆర్టీఐ కమిషనర్లను ఎంపిక చేయలేదంటూ ప్రశ్నించారు. ఒక రకంగా ఆర్టీఐ డెడ్ లెటర్ అవుతుందని వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించాల్సిందిగా డీఓపీటీని ఆదేశించింది. దీంతో ఆగమేఘాల మీద కేంద్రం చర్యలకు దిగింది. కేంద్ర సమాచార కమిషనర్ చీఫ్ గా హీరాలాల్ సమారియాను నియమించింది. ప్రధానంగా దేశంలోని జార్ఖండ్ , త్రిపుర, తెలంగాణ , తదితర రాష్ట్రాల్లోని ఎస్ఐసీలు పనికి రాకుండా పోయాయని ఆర్టీఐ కార్యకర్త అంజలీ భరద్వాజ్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారించింది. మొత్తంగా సుప్రీం దెబ్బకు కేంద్రం విల విల లాడుతోంది.
Also Read : Revanth Reddy : దొరల తెలంగాణకు పాతర