Gidugu Rammurthy: వ్యవహారిక భాషోద్యమ కర్త

తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు గిడుగు రామమూర్తి.

గిడుగు వెంకట రామమూర్తి

 

Gidugu Rammurthy : గిడుగు వెంకట రామమూర్తి (29 ఆగష్టు 1863 – 1940 జనవరి 22 ): తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.

Gidugu Rammurthy – గిడుగు రామమూర్తి విద్యాభ్యాసం

శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించిన గిడుగు రామమూర్తి(Gidugu Rammurthy) విజయనగరం మహారాజా వారి ఇంగ్లీషు పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసాడు. తరువాత నెలకు 30 రూపాయల జీతంలో పర్లాకిమిడి రాజా వారి బళ్ళో ఫస్టుఫారంకు చరిత్ర ఉపాధ్యాయునిగా చేరారు. 1896లో బిఏ లో తెలుగు, సంస్కృతంతో పాటు ప్రధాన పాఠ్యాంశంగా చరిత్ర తీసుకుని రాష్ట్రంలో మొదటి తరగతిలో రెండో ర్యాంకులో ఉత్తీర్ణత సాధించారు. గిడుగు రామమూర్తికి మొదటి నుండి సవర భాషపై మక్కువ ఉండేది. దీనితో సవర, తెలుగు రెండు భాషలు వచ్చిన వ్యక్తిని ఇంట్లో పెట్టుకుని సవరభాషను నేర్చుకున్నారు. సవరభాషలో పుస్తకాలు వ్రాసి, సొంతడబ్బుతో బళ్ళు పెట్టి, అధ్యాపకుల జీతాలు చెల్లించి, సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు. దీనితో మద్రాసు ప్రభుత్వం సవర భాషకు గిడుగు చేస్తున్న కృషికి మెచ్చి 1913 లో “రావు బహదూర్‌” బిరుదు ఇచ్చారు. సుమారు ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931 లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936 లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించాడు.

వ్యవహారిక భాషోద్యమంలో గిడుగు పాత్ర

అప్పటిదాకా పాఠశాలల్లో బోధిస్తున్న తెలుగు, రాసిన పుస్తకాలూ, పరీక్షలూ అన్నీ కూడా గ్రాంథిక (పండిత) భాషలో ఉండేవి. సామాన్యులకు అర్ధం అయ్యేవి కాదు. దీనితోవాటి స్థానంలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టవలసి ఉంటుందని గిడుగు వాదించారు. తెలుగు భాషలో వచ్చిన చారిత్రాత్మకమైన మార్పుకు ప్రధాన కారణం గిడుగు రామమూర్తి సారధ్యంలో నడిచిన వ్యావహారిక భాషోద్యమం. వ్యవహారిక భాష యొక్క ఆవశ్యకతను ఎత్తిచూపుతూ ఆయన చాలా పెద్ద పోరాటమే చెయ్యవలసి వచ్చింది. ఆ ఉద్యమంలో భాగంగా ‘బాలకవి శరణ్యము’, ‘ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము’, గద్యచింతామణి’ వంటి రచనలు చేపట్టారు. ఆ పుస్తకాల్లో వెలిబుచ్చిన భావాల సారాంశంగా 1912 లో A Memorandum of Modern Telugu వెలువరించి ప్రభుత్వానికి సమర్పించారు. 1919-20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాసపత్రిక నడిపారు.

 

గిడులు ప్రశంసలు, పురస్కారాలు

సవర భాషకు గిడుగు చేస్తున్న కృషికి మెచ్చి మద్రాసు ప్రభుత్వం 1913 లో “రావు బహదూర్‌”.
గిడుగు సేవలకు గాను బ్రిటీష్ ప్రభుత్వం 1933 సంవత్సరంలో అతనికి “కైసర్-ఇ-హింద్ మెడల్” బిరుదును ప్రదానం చేసింది.
1938 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణతో గౌరవించింది.

Also Read : Abburi Chayadevi: స్త్రీవాద రచయిత

 

 

 

Leave A Reply

Your Email Id will not be published!