Himaja : రేవ్ పార్టీ కాదు హౌస్ పార్టీ
నటి, బిగ్ బాస్ ఫేమ్ హిమజ
Himaja : హైదరాబాద్ – బిగ్ బాస్ ఫేమ్ , నటి హిమజ సంచలన కామెంట్స్ చేశారు. తన ఇంట్లో హౌస్ పార్టీ చేసుకున్నానని, అయితే దానిని రేవ్ పార్టీ జరిపారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారంటూ ఆరోపించారు. ఇదిలా ఉండగా రేవ్ పార్టీలో తనను అరెస్ట్ చేశారంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తమ ఇంట్లో హౌస్ పార్టీ చేసుకున్నామే తప్పా ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. ఎవరో కావాలని తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకే కొందరు ఇలా చేశారంటూ వాపోయారు నటి హిమజ.
Himaja Comment for her House Party
అయితే పోలీసులు తన ఇంటికి వచ్చిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. పోలీసుల పట్ల తమకు అపారమైన గౌరవం ఉందన్నారు. వారికి అన్ని విధాలుగా సహకరించామని చెప్పారు. ఈ మేరకు బిగ్ బాస్ ఫేమ్ హిమజ(Himaja) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వీడియో ద్వారా తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
ఇంట్లోకి వచ్చిన పోలీసులు చెక్ చేశారని, తాను అరెస్ట్ కాలేదని పేర్కొన్నారు, తాను ఇంట్లోనే ఉన్నానని, ప్రస్తుతం అందరి లాగే దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నానని చెప్పారు. ఎవరికైనా అనుమానం ఉంటే తన ఇంటికి రావచ్చని, నిరభ్యంతరంగా చూసుకోవచ్చంటూ స్పష్టం చేశారు నటి హిమజ.
Also Read : Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి దాదాగిరి