ICC ODI WORLD CUP COMMENT : క‌ప్ గెలిచేనా జెండా ఎగిరేనా

అడుగు దూరం అందుతుందా విజ‌యం

ICC ODI WORLD CUP : కోట్లాది మంది క‌ళ్ల‌ల్లో వ‌త్తులు వేసుకుని చూస్తున్నారు. భార‌తీయ జెండాలు రెప రెప లాడాల‌ని కోరుకుంటున్నారు. ఈ దేశంలో క్రికెట్ అన్న‌ది మ‌తం కంటే ఎక్కువ‌. దానిని త‌మ ప్రాణంగా భావిస్తారు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో రికార్డ్ బ్రేక్ చేసింది. ఏకంగా ఇప్ప‌టి వ‌ర‌కు 9 మ్యాచ్ లు ఆడింది. అన్నింట్లోనూ గెలుస్తూ వ‌చ్చింది. ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. శుభ్ మ‌న్ గిల్ , రోహిత్ శ‌ర్మ‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ , సూర్య కుమార్ యాద‌వ్ అద్భుతంగా రాణించారు. ఇక బౌలింగ్ విష‌యానికి వ‌స్తే టీమిండియా పేస‌ర్లు, స్పిన్న‌ర్లు దుమ్ము రేపారు. ప్ర‌ధానంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూ వ‌స్తున్న మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ త‌న ప్ర‌తాపం చూపించాడు. అత‌డికి హైద‌రాబాద్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ కీల‌క పాత్ర పోషించాడు. బౌల‌ర్ గా రాణించినా ఫీల్డ‌ర్ గా ఫెయిల్ అయ్యాడు. కీల‌క స‌మ‌యంలో క్యాచ్ లు విడిచాడు.

ICC ODI WORLD CUP Comment

ఐసీసీ(ICC) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 10 టీమ్ లు పాల్గొన్నాయి. ఇందులో ఆశించిన దానికంటే అంచ‌నాలకు మించి ఆడిన జ‌ట్టు ఏదైనా ఉందంటే అది ఆఫ్గ‌నిస్తాన్ టీమ్. దీనికి మెంటార్ గా ఉన్నాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ అజ‌య్ జ‌డేజా. ఆ జ‌ట్టు ప్ర‌ధాన జ‌ట్ల‌కు చుక్క‌లు చూపించింది. ఇదే స‌మ‌యంలో ఆడుతుంద‌ని అనుకున్న శ్రీ‌లంక ఘోర‌మైన ప‌ర్ ఫార్మెన్స్ తో నిరాశ ప‌రిచింది. చివ‌ర‌కు శ్రీ‌లంక ప్ర‌భుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.

ఏకంగా శ్రీ‌లంక క్రికెట్ బోర్డును ర‌ద్దు చేసింది. ఇది ప‌క్క‌న పెడితే మాజీ ఛాంపియ‌న్ , టోర్నీలో హాట్ ఫెవ‌రేట్ గా పేరు పొందిన ఇంగ్లండ్ జ‌ట్టు మిశ్ర‌మ విజ‌యాల‌తో నిరాశ ప‌రిచింది. అంచ‌నాల‌న‌న్నీ త‌ప్పాయి. క్రికెట్ ఫాన్స్, మాజీ క్రికెట‌ర్లంతా ఇప్పుడు భార‌త్ కు ఛాన్స్ ఉంద‌ని పేర్కొంటున్నారు. ఇదంతా ప‌క్క‌న పెడితే దాయాది పాకిస్తాన్ జ‌ట్టు బొక్క బోర్లా ప‌డింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో భార‌త జ‌ట్టు చేతిలో ఓట‌మి పాలైంది.

మెగా టోర్నీలో ఇప్ప‌టి దాకా నాలుగు జ‌ట్లు సెమీస్ కు చేరుకున్నాయి. టీమిండియా, న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు క‌ద‌న రంగంలో మిగిలాయి. ఆయా జ‌ట్ల‌న్నీ ఫైన‌ల్ కు రావాల‌ని ఆరాట ప‌డ‌తాయి. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేదు. పోటీ హోరా హోరీగా మార‌డం స‌హ‌జం. మొత్తంగా భార‌త క్రికెట్ జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ ను గెల‌వాల‌ని కోట్లాది భార‌తీయులు కోరుకుంటున్నారు. యావ‌త్ భార‌త దేశం మొత్తం టీమిండియాకు ద‌క్కుతుంద‌ని, ఆశించిన దానికంటే ప్ర‌తిభా పాట‌వాల‌తో ఆక‌ట్టుకుంటుంద‌ని ఆశిస్తున్నారు. అంద‌రికంటే మిన్న‌గా టీమిండియా క‌ప్ సాధించాల‌ని..భార‌త దేశ‌పు త్రివ‌ర్ణ ప‌త‌కాలు ఎగ‌రాల‌ని కోరుకుంటున్నారు. ఇందులో తప్పు ఏమీ లేదు. ఎందుకంటే కోట్లాది భార‌తీయుల‌ను క‌లుపుతున్న‌ది క్రికెట్ కాబ‌ట్టి.

Also Read : Telangana Election Comment : తెలంగాణం త‌ల‌వంచ‌ని ధీర‌త్వం

Leave A Reply

Your Email Id will not be published!