Mohammed Shami Comment : షమీ షాన్ దార్ ఆట జోర్దార్
క్రికెట్ రంగంలో తురుపు ముక్క
Mohammed Shami Comment : కళ్లు చెదిరే బంతులతో ప్రత్యర్థుల గుండెల్లో భయం కలిగించేలా చేసే బౌలర్లలో ఒకే ఒక్కడు మహమ్మద్ షమీ(Mohammed Shami). ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు 5 వికెట్ల చొప్పున తీశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 70 పరుగుల తేడాతో ఓడించింది న్యూజిలాండ్ ను. ఇది ఊహించని షాక్. భారత జట్టు ఇప్పటి దాకా 9 మ్యాచ్ లు ఆడింది. అన్ని మ్యాచ్ లు గెలుపొందింది. విచిత్రం ఏమిటంటే శార్దూల్ ఠాకూర్ కు బదులు నాలుగు మ్యాచ్ ల తర్వాత ఎంట్రీ ఇచ్చాడు టోర్నీలో షమీ. కానీ సీన్ పూర్తిగా మారి పోయింది తను వచ్చాక. కెప్టెన్ రోహిత్ శర్మ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. తను ఎన్నో విమర్శల పాలయ్యాడు. దుబాయ్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ధారాళంగా పరుగులు ఇచ్చాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యాడు.
Mohammed Shami Comment Viral
చివరకు తన దేశ భక్తిని శంకించారు. అయినా తాను నిజమైన క్రికెటర్ నని, తన నరనరాన భారతీయత దాగి ఉందని నిరూపించాడు. ప్రతిసారీ ఆటపైనే ఫోకస్ ఉంటుందని, వంద శాతం పర్ ఫార్మెన్స్ చూపించాలని ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశాడు. విచిత్రం ఏమిటంటే తన భార్యతో విభేదాలు వచ్చాయి. విడాకుల దాకా వెళ్లింది. తీవ్ర విమర్శలు చేసింది. చివరకు కోర్టు దాకా వెళ్లడంతో కోర్టు నెలకు భరణం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తన కుటుంబం బాగు పడాలంటే , తమకు భరణం ఇవ్వాలంటే తప్పక ఆడాల్సిందేనంటూ సెటైర్ వేసింది షమీ భార్య. ఇది పక్కన పెడితే తను ఎదుర్కొన్న ఇక్కట్లే తను అద్భుతంగా బౌలింగ్ చేసేందుకు దోహద పడేలా చేసిందని ఆ మధ్యన తెలిపాడు. ఏది ఏమైనా ఆకలి, అవమానాలు మనుషుల్ని రాటు దేలేలా చేస్తాయని షమీని చూస్తే తెలుస్తుంది.
ఇక వరల్డ్ కప్ విషయానికి వస్తే షమీ టోటల్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. కసి తీరా ఆడాడు. వికెట్లను కూల్చాడు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. మొత్తంగా తన వికెట్ల స్కోర్ హాఫ్ సెంచరీని దాటింది. ఇన్నేళ్ల పాటు ఒకే స్థాయిలో ఫేసర్ గా రాణించడం మామూలు విషయం కాదు. ఆ మధ్యన విండీస్ మాజీ బౌలర్ మైక్ హోల్డింగ్ ఓ మాటన్నాడు. శార్దూల్ , సిరాజ్ , బుమ్రా కలిస్తే ఓ మహమ్మద్ షమీ(Mohammed Shami) అని కితాబు ఇచ్చాడు. తన బౌలింగ్ పరంగా చెప్పాలంటే ఏ సిట్యూయేషన్ లోనైనా సరే పిచ్ కు అనుగుణంగా బంతులను మార్చడం, లైన్ అండ్ లెంగ్త్ లో వేయడం లో తనకు తనే సాటి. ఏది ఏమైనా షమీ ఇవాళ దేశ వ్యాప్తంగా హీరోగా మారి పోయాడు. కానీ ఎక్కడా గర్వానికి లోను కాలేదు. నవ్వుకుంటూ బంతిని చేతిలోకి తీసుకుంటూ హర్ష ధ్వానాల మధ్య పెవిలియన్ చేరాడు. షమీ ఈ స్థాయికి రావడానికి కారణం ఒకే ఒక్కడు మాజీ క్రికెటర్ దాదా. థ్యాంక్యూ గంగూలీ.
Also Read : SA vs AUS ICC ODI World Cup : మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్