Minister KTR : యువతకు భరోసా కేటీఆర్ ఆసరా
గెలిచాక ఉద్యోగాల భర్తీలో పారదర్శకత
Minister KTR : హైదరాబాద్ – స్వరం మారుతోంది. తెలంగాణలో ప్రస్తుతం కొలువు తీరిన బీఆర్ఎస్ పార్టీ ఏటికి ఎదురీదుతోందని చెప్పక తప్పదు. భారీ ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అమలు చేస్తున్న సంక్షేమ పథాకాల మాటేమిటో కానీ 40 లక్షలకు పైగా నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా వేలాది జాబ్స్ భర్తీ చేసినట్లు పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.
Minister KTR Comment
ఆయన హైదరాబాద్ లోని నిరుద్యోగులతో ములాఖత్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్దం అవుతున్న యువతకు జాబ్స్ వచ్చేలా పూర్తి భరోసా ఇచ్చే పూచీ తనదన్నారు కేటీఆర్(Minister KTR). ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారి నుంచే అంటే డిసెంబర్ 4వ తేదీ న ఉదయం 10 గంటలకు అశోక్ నగర్ లోని యువతతో తాను సమావేశం అవుతానని స్పష్టం చేశారు కేటీఆర్.
అధికారంలోకి రాగానే వెంటనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామన్నారు. గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్యను మరింత పెంచుతామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న జాబ్స్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు కేటీఆర్. నోటిఫికేషన్ల ఫలితాల జారీపైన ఉన్న కేసుల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. యువతతో ములాఖత్ కావడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Also Read : Revanth Reddy Slams : నిరంజన్ రెడ్డిపై రేవంత్ ఫైర్
