Sajjala Rama Krishna Reddy : టీడీపీ..జనసేన దొంగల ముఠా
సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్
Sajjala Rama Krishna Reddy : అమరావతి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Rama Krishna Reddy) సంచలన కామెంట్స్ చేశారు. తెలుగుదేశం , జనసేన పార్టీలను దొంగల ముఠాగా అభివర్ణించారు. ఏపీ ప్రజలు ఈ పార్టీలను చూసి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Sajjala Rama Krishna Reddy Shocking Comments on TDP..Janasena
సేవా మిత్ర పేరుతో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజల నుంచి వ్యక్తిగత వివరాలు సేకరించారని ఆరోపించారు. ఈ ఇన్ఫర్మేషన్ తో ప్రజల ప్రైవసీకి భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగల పార్టీ అధికారంలోకి వస్తే ఇంకెన్ని అరాచకాలు జరుగుతాయో ఆలోచించు కోవాలని సూచించారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
సేవా మిత్ర పేరుతో సేకరించిన డేటాతో టీడీపీ , జనసేన పార్టీలు బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం లేక పోలేదంటూ హెచ్చరించారు. ఓటర్ ఐడీ కార్డు తీసుకుని ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపించారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
సిస్టమ్ లో వైరస్ లా చొరబడ్డారంటూ మండిపడ్డారు. డేటా అంతా సేకరించి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారంటూ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆరోపించారు. పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీద పడుతోందన్నారు.
Also Read : Minister KTR : యువతకు భరోసా కేటీఆర్ ఆసరా
