Priyanka Gandhi Tour : ప్రియాంక సుడిగాలి పర్యటన
10 నియోజకవర్గాలలో బిజీ బిజీ
Priyanka Gandhi : తెలంగాణలో ప్రస్తుతం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ప్రధానంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బిగ్ ఫైట్ స్టార్ట్ అయ్యింది. ఈసారి ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తోంది.
Priyanka Gandhi Meetings Viral
ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో పాటు మాజీ చీఫ్, వాయనాయుడు ఎంపీ రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) విస్తృతంగా పర్యటించారు. ఇప్పటికే పలు ప్రాంతాలను జల్లెడ పట్టారు. తాజాగా టీపీసీసీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రియాంక గాంధీ నవంబర్ 24, 25, 26 తేదీలలో మొత్తం 10 నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేస్తారని పార్టీ తెలిపింది.
ప్రచారంలో భాగంగా నవంబర్ 24న పాలకుర్తి, హుస్నాబాద్ , ధర్మపురి లో జరిగే సభల్లో పాల్గొంటారు. 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిరలలో జరిగే సభలకు ప్రియాంక హాజరవుతారు. 26న మునుగోడు, దేవరకొండ, గద్వాలలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.
ప్రియాంకతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నాయకులు కూడా హాజరవుతారని పార్టీ స్పష్టం చేసింది.
Also Read : Sajjala Rama Krishna Reddy : టీడీపీ..జనసేన దొంగల ముఠా
