Andhra Voters : బీఆర్ఎస్ కు జై కొట్టిన షెటిల‌ర్స్

ప‌ని చేయ‌ని చంద్ర‌బాబు మంత్రం

Andhra Voters : హైద‌రాబాద్ – చంద్ర‌బాబు అరెస్ట్ వ్య‌వ‌హారం ఎలాంటి ప్ర‌భావం చూపించ లేదు గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో. తెలంగాణ‌లో ఎన్నిక‌లు ముగిశాయి. ఫ‌లితాలు వ‌చ్చాయి. విచిత్రం ఏమిటంటే షెటిల‌ర్స్ గంప గుత్త‌గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తార‌ని అనుకున్నారు. కానీ వీరంతా పూర్తిగా దొర కేసీఆర్ పార్టీ వైపు మొగ్గుచూపారు. వారికి ఎక్కువ‌గా సీట్లు వీరి ద్వారా వ‌చ్చిన‌వే. తెలంగాణ(Telangana) ప్ర‌జ‌లు ఛీ కొడితే షెటిల‌ర్స్ జై కొట్టారు.

Andhra Voters Support

ఇక నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చూస్తే భారీ మెజారిటీ ఇవ్వ‌డం విస్తు పోయేలా చేసింది. కూకట్ ప‌ల్లిలో 70, 387 ఓట్లు, శేరి లింగంప‌ల్లిలో 46,552 ఓట్లు , కుత్బుల్లాపూర్ లో 85,576 , అంబ‌ర్ పేట లో 24,537 ఓట్లు, జూబ్లీ హిల్స్ లో 16,000 , ఖైర‌తాబాద్ లో 22,010 ఓట్లు రావ‌డం విశేషం.

ఇక ఎల్బీ న‌గ‌ర్ లో 22,305 ఓట్లు, మ‌ల్కాజ్ గిరి లో 49,530 ఓట్లు , మేడ్చ‌ల్ లో 33,419 ఓట్లు, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో 37,797 , ప‌టాన్ చెరు లో 7,091 ఓట్లు, రాజేంద్ర న‌గ‌ర్ లో 32,096 , స‌న‌త్ న‌గ‌ర్ లో 41,827 ఓట్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 17,169 ఓట్లు, ఉప్ప‌ల్ లో 49 వేల 030 ఓట్ల‌తో గెలుపొందారు. వీరిలో అత్య‌ధికంగా షెటిల‌ర్స్ కాంగ్రెస్ ను ఆద‌రించ‌లేదు. దొర పార్టీని ఆద‌రించారు.

Also Read : Eatala Rajender : ఈట‌ల‌కు కోలుకోలేని షాక్

Leave A Reply

Your Email Id will not be published!