Telangana CLP Meeting : సీఎల్పీ నేత ఎంపికపై ఉత్కంఠ‌

కొన‌సాగుతున్న స‌మావేశం

Telangana CLP Meeting : హైద‌రాబాద్ – ఎవ‌రు సీఎల్పీ నేత‌గా ఎంపిక‌వుతార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. గ‌చ్చిబౌలి లోని హోట‌ల్ ఎల్లాలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో 65 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో మిత్ర‌ప‌క్షంగా ఉన్న సీపీఐకి చెందిన కూన‌మ‌నేని సాంబ‌శివ‌రావు ఖ‌మ్మం జిల్లా నుంచి ఎంపిక‌య్యారు.

Telangana CLP Meeting Updates

ప్ర‌స్తుతం సీఎం రేసులో ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన అనుముల రేవంత్ రెడ్డితో పాటు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోద‌ర రాజ న‌ర‌సింహ పోటీ ప‌డుతున్నారు. కీల‌క భేటీకి ముందు పార్టీకి చెందిన గెలుపొందిన వారంతా హాజ‌ర‌య్యారు.

స‌మావేశానికి ముందు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ భ‌ట్టి విక్ర‌మార్క‌, కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డితో భేటీ కావ‌డం మ‌రింత ఆస‌క్తిని క‌లిగించింది. ఈసారి ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ(Congress).

చెప్పిన‌ట్టుగానే రేవంత్ రెడ్డి ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు . రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ వైపు చూస్తోంది. ఎవ‌రికి హైక‌మాండ్ ప‌ట్టం క‌డుతుందనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. మొత్తం మీద డీకే శివ‌కుమ‌రా్ అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Also Read : Gareth Wynn Owen : రేవంత్ కు హై క‌మిష‌న‌ర్ కంగ్రాట్స్

Leave A Reply

Your Email Id will not be published!