Jeevan Reddy MLC : ఉచిత ప్ర‌యాణం మ‌హిళ‌ల‌కు వ‌రం

ఎమ్మెల్సీ టి. జీవ‌న్ రెడ్డి కామెంట్స్

Jeevan Reddy MLC : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన వెంట‌నే ఇచ్చిన మాట ప్ర‌కారం మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాన్ని అమ‌లు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ టి. జీవ‌న్ రెడ్డి . మ‌హిళ‌ల‌కు ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణం అమ‌లు చేసి తీరుతామ‌ని ముందుగానే చెప్పామ‌ని, చెప్పిన‌ట్టుగానే చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు.

Jeevan Reddy MLC Comment

ఉచితంగా ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణం చేస్తున్న మ‌హిళ‌ల‌తో క‌లిసి జీవ‌న్ రెడ్డి(Jeevan Reddy MLC) ప్ర‌యాణం చేశారు. ఈ సంద‌ర్బంగా వారితో క‌లిసి ముచ్చ‌టించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ పుట్టిన రోజు సంద‌ర్బంగా మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాన్ని తీసుకు రావ‌డం జ‌రిగింద‌ని చెప్పారు ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి.

సోనియ‌మ్మ ఇచ్చిన మాట ప్ర‌కారం త‌మ ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ మొద‌లు పెట్టింద‌ని , అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన ఎవ‌రైనా, ఏ స్థాయిలో ఉన్నా స‌రే వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు . స‌ర్కార్ త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంద‌న్నారు .

తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేశార‌ని జీవ‌న్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న చేసిన అప్పుల‌ను తీర్చేందుకే త‌మ స‌మ‌యం స‌రి పోద‌న్నారు.

Also Read : Chandra Babu Naidu

Leave A Reply

Your Email Id will not be published!