Konda Surekha : మేడారం జాతరకు నిధులు ఇవ్వండి
సీఎంకు మంత్రి కొండా సురేఖ విన్నపం
Konda Surekha : హైదరాబాద్ – ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా ప్రసిద్ది చెందింది సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. ఇదిలా ఉండగా జాతర సందర్భంగా ఈ ప్రాంతంలో అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రభుత్వ పరంగా నిధులు విడుదలు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
Konda Surekha Request
2024 సంవత్సరంలో సమ్మక్క సారలమ్మ మేడారం జాతర స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కొండా సురేఖ(Konda Surekha). అంతే కాకుండా యాత్రికుల కోసం దుకాణాల సముదాయం, విశ్రాంతి గదులు, తాగునీటి నిర్మాణాలు, మండపం వంటి శాశ్వత సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇందుకు ప్రభుత్వ పరంగా నిధులు విడుదల చేస్తే త్వరితగతిన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టాలని లేక పోతే లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఇబ్బంది ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి.
కేంద్ర ప్రభుత్వం సైతం పర్యాటక ప్రాంతాలకు నిధులు విడుదల చేస్తుందని, ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు కొండా సురేఖ.
Also Read : Vijaya Shanti : పరామర్శిస్తే విమర్శలేలా